Advertisement
Google Ads BL

ధోనితో ఎఫైరా! అదసలు లెక్కే కాదంటోంది!


ప్రముఖ దక్షిణాది హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌ అలియాస్‌ రాయ్‌ లక్ష్మి తెలుగులో శ్రీకాంత్‌ నటించిన 'కాంచనమాల కేబుల్‌ టీవీ' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. కన్నడ నటి ఆయిన ఈమె తర్వాత పలు చిత్రాలలో అందాలను ఆరబోసినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. తెలుగులో అయితే ఈ భామ పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', మెగాస్టార్‌ చిరంజీవి 150వ రీఎంట్రీ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150' వంటి చిత్రాలలో ఐటం సాంగ్స్‌ కూడా చేసింది. కానీ పేరును మార్చుకున్నా ఈ భామకి ఫేట్‌ కలిసిరాలేదు. కేవలం ఐటం సాంగ్స్‌ మాత్రమే వస్తుండటంతో తన గ్లామర్‌షోకి బాలీవుడ్డే సరైన వేదిక అని తెలుసుకుని సన్నిలియోన్‌, రాఖీసావంత్‌ వంటి వారి రేంజ్‌లో అందాలు ఆరబోయడానికి సిద్దమై బాలీవుడ్‌ మెట్లెక్కింది. 

Advertisement
CJ Advs

ఇక అక్కడ అడల్ట్‌ మూవీగా రూపొందుతున్న 'జూలీ 2' చిత్రంలో ఏకంగా లీడ్‌రోల్‌లో అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లో టైటిల్‌రోల్‌ని పోషించే అవకాశం రావడం, అందునా అల్ట్రా మోడ్రన్‌ పాత్రలో చాన్స్‌ దక్కించుకున్న ఆమె అందాల ఆరబోతను చూస్తున్న వారు ఈ అమ్మడికి బాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. ఇక ఈమె నాడు ఇండియన్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ధోనితో ఎఫైర్‌ నడిపి వార్తల్లో నిలిచింది. ఏదో ఎంజాయ్‌ చేసినంత కాలం ఎంజాయ్‌ చేసిన లక్ష్మీరాయ్‌ నాడు ధోని పుణ్యమా అని ఎప్పుడు హెడ్‌లైన్స్‌లో ఉండేది. ఇక ధోని ఈ ఎఫైర్‌కి బ్రేకప్‌ చెప్పి సాక్షి అనే ఆమెను వివాహమాడినా కూడా లక్ష్మీరాయ్‌కి ఇప్పటికీ బాలీవుడ్‌ మీడియా నుంచి ధోనితో ఎఫైర్‌ నాటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. 

'జూలీ 2' ప్రమోషన్‌లో పాల్గొంటున్న ఈమెకు ప్రతి చోట ఇవే ప్రశ్నలు ఎదురవుతుండటంతో ఈమె మీడియా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. 'నేను ధోని తర్వాత నలుగురైదుగురికితో కూడా ఎఫైర్స్‌ కొనసాగించాను. వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే. మరి వారందరినీ వదిలేసి ధోని ఒక్కడితో ఎఫైర్ల గురించే ఎందుకు అడుగుతున్నారు? అని అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈమె మీడియాకు చెప్పిన సమాధానం షాకింగ్‌గా ఉండటమే కాదు.. మరోసారి లక్ష్మీరాయ్‌ వార్తల్లో నిలిచేలా చేసింది. 

ధోని కాకుండా నలుగురైదుగురు ప్రముఖులతో కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు ఈ టాపిక్‌ హాట్‌గా మారింది. అంటే ఆమె ధోని విషయంలో ఏదో సమాధానం చెప్పకుండా ఇలా నలుగురైదుగురితో కూడా రిలేషన్‌షిప్‌ కొనసాగించానని చెప్పడం ద్వారా ఆమె 'జూలీ 2'కి ప్రమోషన్‌కి, తాను మరలా వార్తలో ఉండేందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా? అనే అనుమానం వస్తోంది. అయినా ఎందరితో రిలేషన్‌ షిప్‌ మెయిన్‌ టెయిన్‌ చేసినా ధోనితో అంటే దాని కిక్కే వేరని ఆ అమ్మడికి తెలియదా! ఏంటి...? 

Raai Laxmi Sensational Comments on With MS Dhoni Affair:

Raai Laxmi Sensational Comments at Julie 2 Promotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs