Advertisement
Google Ads BL

రకుల్ ని తీసుకువస్తేనే అంటోన్న హీరోలు!


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌... ప్రస్తుతం ఈ భామని తెలుగులో నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌ అనే చెప్పాలి. ఈ అమ్మడితో పాటు ఇండస్ట్రీకి ఎంటరైన పలువురు రెజీనా, రాశిఖన్నా వంటి వారు ఇంకా స్టార్‌ హోదా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. మొదట్లో ఏమాత్రం ఆకట్టుకోలేక కేవలం గ్లామర్‌షోలకే పరిమితమైన రకుల్‌ప్రీత్‌ అతి త్వరగా స్టార్‌ స్టేటస్‌ని తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన 'రారండోయ్‌ వేడుక చూద్దాం, జయ జానకి నాయకా' చిత్రాలతో గ్లామర్‌ని ఒలకబోసిన విధంగానే తన నటనతో కూడా ప్రేక్షకులని మెప్పించి, తనలో నటనాపరమైన టాలెంట్‌ ఉందని నిరూపించింది. 

Advertisement
CJ Advs

ఇక మురుగదాస్‌ - మహేష్‌బాబు వంటి ప్రతిష్టాత్మకమైన కాంబోలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతూ ఈ నెల 27న విడుదలకు సిద్దమవుతున్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'స్పైడర్‌'లో నటించింది. ఇక ఈ చిత్రంతో ఈ ఏడాది ఈ భామ మొదటి హ్యాట్రిక్‌ను సాధిస్తాననే ఆశతో ఉంది. ఇప్పటికే ఆమె తమిళంలో కార్తి హీరోగా ఓ చిత్రంలో పేదింటి అమ్మాయిగా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో నటించింది. ఇక విశాల్‌ బలవంతం మీద ఆయన చిత్రానికి అగ్రిమెంట్‌ చేసినా కూడా తర్వాత తనకు డేట్స్‌ ప్రాబ్లమ్‌ వస్తాయనే ఉద్దేశ్యంతో అతనిచ్చిన అడ్వాన్స్‌ని తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకుంది. కానీ విశాల్‌ మాత్రం మీకు వీలున్నప్పుడు డేట్స్‌ ఇస్తే వాటి ప్రకారమే షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకుంటామని చెప్పి ఆమెను గట్టిగా బతిమాలి నిరూపించుకున్నాడు. 

మరో వైపు మురుగదాస్‌-మహేష్‌బాబుల చిత్రమైన 'స్పైడర్‌' పుణ్యమా అని నిన్నటివరకు కార్తి, విశాల్‌కి పరిమితమైన ఈమెను ఇప్పుడు కోలీవుడ్‌ స్టార్స్‌ అజిత్‌, విజయ్‌, శివకార్తికేయన్‌, సూర్య వంటివారు కూడా ఈమె వైపే చూస్తున్నారు. ఈమె నటిస్తే తెలుగులో తమ చిత్రాలకు మంచి డిమాండ్‌ ఏర్పడుతుందనే ఆశతో ఈ స్టార్స్‌ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో సిద్దార్ధ్‌మల్హోత్రా హీరోగా రూపొందుతున్న 'అయ్యారే' చిత్రం కోసం ఢిల్లీలో షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ షెడ్యూల్‌ ముగించుకుని వెంటనే 'స్పైడర్‌' ప్రమోషన్‌లో పాల్గొననున్న రకుల్.. ఈ చిత్రం విడుదల తర్వాతనే తాను నటించబోయే ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టనుంది. మొత్తానికి రకుల్‌ తమిళ స్టార్‌ హీరోయిన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందనే చెప్పాలి. 

Kollywood Star Heroies Eyes on Rakul Preet Singh:

Tamil Heroes wants Rakul Preet Singh for their Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs