Advertisement
Google Ads BL

ముఖ్యమంత్రి భరత్ ఎక్కడ..?


మహేష్ స్పైడర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ చిత్రం మరో నాలుగు రోజుల్లో అంటే వచ్చే బుధవారమే విడుదల కానుంది. అయితే మహేష్ బాబు స్పైడర్ విడుదలవకముందే ఏన్నడు లేని విధంగా కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాని మొదలు పెట్టేసి షాక్ ఇచ్చేశాడు. ఎప్పుడూ సినిమా సినిమాకి గ్యాప్ తీసుకునే మహేష్ ఇప్పుడు తొందరపడుతున్నాడు. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందొచ్చిన శ్రీమంతుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ హిట్ కాంబినేషన్ మరలా రిపీట్ రావడంతోనే మహేష్ - కొరటాల కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement
CJ Advs

ఇక కొరటాల, మహేష్ సినిమాలో పోసాని కృష్ణ మురళి ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడని .... సినిమా మొత్తం మీద పోసాని పాత్రే ఈ సినిమాకి హైలెట్ అని భరత్ అనే నేను సినిమా మొదలైనప్పటి నుండి చెబుతున్న మాట. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడు. ఇక దీనికోసమే కోట్లు ఖర్చుపెట్టి అసెంబ్లీ సెట్ ని కూడా వేయించాడు కొరటాల శివ. అయితే ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలోని ఒక పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ పిక్ లో అసెంబ్లీ లో మంత్రులు వున్నట్టు... అసెంబ్లీలో పోసాని కృష్ణ మురళి తనదయిన ప్రపంచంలో ఉన్నాడు. మాములుగా బయట అసెంబ్లీలాగే కనబడుతున్న ఈ అసెంబ్లీ సెట్ లో పోసాని తోపాటు బెనర్జీ, జీవ వంటి నటులు కూడా కనబడుతున్నారు.

మరి పోసాని అసెంబ్లీలో ఏం చేస్తున్నట్టు అంటూ సరదాగా కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఈ సినిమా అంతా పొలిటికల్ గానే ఉంటుంది గనక ఈ సినిమాలో అసెంబ్లీ వంటివి ఉండాలి.  అయితే అసెంబ్లీలో అందరూ ఉన్నారు గాని మహేష్ ఎక్కడా అంటూ మహేష్ అభిమానులు ఆతృతగా అడుగుతున్నారు. ఇకపోతే ఇప్పటికే కొరటాల శివ ఈ సెట్ లో సన్నివేశాలను 40  రోజుల పాటు షూట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా.... కైరా అద్వానీ మహేష్ కి జోడిగా నటిస్తుంది.

Bharath Anu Nenu Assembly Set Photo Leaked:

Posani Krishna in Bharath Anu Nenu Movie Leaked Photo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs