Advertisement
Google Ads BL

పెళ్ళైన తర్వాత నయన్ అత్తమామలకి తెలిస్తే!


సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నయనతార మీద వచ్చిన రూమర్స్ మరే హీరోయిన్ మీద రాలేదు అంటే అది అతిశయోక్తి కాదు. ఎన్ని రూమర్స్ తన మీద వచ్చినా ఎప్పుడు నయనతార స్పందించదు. మొదటగా శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి మీడియాలో సెన్సేషన్ అయ్యింది. ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో బాగా హైలెట్ అయిన నయన్ ఆ తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో  ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో కథనాలు కథలుకథలుగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్లపై నయనతార ఒక మలయాళ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో గట్టిగానే స్పందించింది. 

Advertisement
CJ Advs

నేను చాలా అరుదుగా మట్లాడుతుంటానని... ఎదుటి వాళ్లు ఏవేవో కల్పించి ఉన్నవి లేనివి క్రియేట్ చేస్తున్నారు..... వాటి విషయంలో నేను నోరు విప్పను. అసలు నేను మాట్లాడాలనుకుంటే తప్ప నా మనసులోని మాటలను ఎవరూ వినలేరు... అంతేగాని నేనేం మాట్లాడకుండా ఉన్నది లేనిది కల్పిస్తే నాకేం నష్టం లేదు. అలాగే నేను సినిమాల్లోకి నటించడానికే వచ్చాను... అంతేగాని కథ నచ్చితేనే సినిమాలో చేస్తానని మడి కట్టుకుని కూర్చుంటే అసలు అవకాశాలే రావు. అయినా అందాల ఆరబోతలో నయనతార చూడండి ఎలా రెచ్చిపోతుందో అని రాసే వాళ్ళే... ఆ తర్వాత అవకాశాలు రాకపోతే నయనతారకు అవకాశాలు రావడంలేదు చూడండి అంటూ రాస్తారు.

ఇటువంటి వార్తలు నాకసలు ఇష్టం ఉండవు. ఇక నా పెళ్లి విషయంలోనూ రకరకాల వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి...కానీ ఆ వార్తల్లో అసలు నిజమెంతో నాకు, నా కుటుంబానికే తెలుసు. నా కుటుంబం నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చింది. అలాంటి  వాళ్ళ దగ్గర నా పెళ్లి విషయం దాయాల్సిన అవసరం ఏమిటి. ఇక పెళ్లి మీద నాకు చాలా గౌరవం ఉంది. నేను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు లేనివి ఉన్నట్టుగా రాసేవారు ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుంటే మంచిదని చెబుతుంది నయన్. అంతేకాదు ఈ రూమర్స్ అన్నీ రేపు పెళ్ళైన తర్వాత నా అత్తమామలు కి తెలిస్తే... వారు అవి నమ్మితే నా పరిస్థితి ఏమిటి అంటూ ఫైర్ అవుతుంది.

Nayanthara Fires on Gossip Mongers:

Nayanthara Reacts on her Personal Life
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs