Advertisement
Google Ads BL

ఖండించావ్ గా చిరు..ఇప్పుడు చెప్పు..?


చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ పెళ్లి విషయం నాడు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. శిరీష్‌భరద్వాజ్‌ని తన తల్లిదండ్రులను, బాబాయ్‌లను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. చివరకు తన బాబాయ్‌, తండ్రుల నుంచి తన భర్తకి ప్రాణభయం ఉందని పోలీస్‌ కేసు కూడా పెట్టడంతో పవన్‌ తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ని పోలీసులకు సరెండర్‌ చేశాడు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలబడలేదు. ఓ పాప పుట్టిన వెంటనే విడాకులు తీసుకుని తన పుట్టింటికి చేరింది. 

Advertisement
CJ Advs

ఇక ఆమెకు నెల్లూరుకు చెందిన ప్రముఖ బంగారునగల వ్యాపారవేత్త కుమారుడు కళ్యాణ్‌తో రెండో వివాహం జరిపి తమ శ్రీజకు మొదటి భర్త వల్ల కలిగిన పాపను కొత్త జంటకు అడ్డం లేకుండా హాస్టల్‌ లో చేర్పించారు. ఇక నెల్లూరుకి చెందిన కళ్యాణ్‌కి మొదటి నుంచి నటుడు కావాలనేది కోరిక అని ఆయన స్నేహితులు చెబుతారు. ఈ విషయమై ఓ సారి మీడియా చిరంజీవిని మీ రెండో అల్లుడు హీరో అవుతాడా? అని ప్రశ్నిస్తే అదేం లేదని, అవ్వన్నీ గాలివార్తలని కొట్టేశాడు. కానీ ఇటీవల కళ్యాణ్‌ తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. కళ్యాణ్‌కి నటుడికి కావాల్సిన అర్హతలన్నీఉన్నాయని మెగాభిమానులు భజన పర్వం మొదలుపెట్టారు. 

తాజాగా కళ్యాణ్‌ని హీరో చేసే క్రమంలో చిరంజీవి కూడా కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, రవితేజ, వరుణ్‌తేజ్‌ వంటి వారికి నటనలో శిక్షణ వచ్చిన వైజాగ్‌ సత్యానంద్‌ని చిరంజీవి తన చిన్నల్లుడికి నటనలో శిక్షణ ఇవ్వమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవ్వన్నీ చూస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి పవన్‌కళ్యాణ్‌ తర్వాత మరో కళ్యాణ్‌బాబు రావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Chiranjeevi's Son in Law Film Debut Soon:

Here is a great news for mega family fans across the globe. One more hero from mega family will be making his grand debut soon. And he is none other than Megastar Chiranjeevi's son-in-law and Srija's husband Kanuganti Kalyan. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs