ఇప్పటివరకు నైజాం ఏరియాలో పవన్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లు కూడా 20కోట్లను క్రాస్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం 19కోట్ల దగ్గరే ఆగిపోయాడు. దాంతో ఎన్టీఆర్‌కి సీడెడ్, ఆంధ్రాలలో ఉన్న ఫాలోయింగ్ నైజాంలో లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నేడు తెలుగు సినిమాలకు ఆయువు పుట్ట నైజాం ఏరియా. అయితే తాజాగా విడుదలైన 'జైలవకుశ'తో ఎన్టీఆర్ 20కోట్ల వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నైజాంలో 350కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయనుండటం, తెలంగాణలో ఐదు షోలకి పర్మిషన్ ఉండటంతో ఈ వీకెండ్‌లోపలే ఎన్టీఆర్ ఈసారి 20కోట్లను దాటడం ఖాయంగా తెలుస్తుంది.