Advertisement
Google Ads BL

సమంత ఆమెను ఏడిపించింది అయ్యో... పాపం..!


అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్న 'రాజు గారి గది 2' వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఓంకార్ తమ్ముడు అశ్విన్, సీరత్ కపూర్ లు హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా సమంత ఈ 'రాజు గారి గది 2' లో ఆత్మగా కనిపించనుంది. నాగార్జున మాత్రం ఈ చిత్రంలో  మెంటలిస్ట్ అంటే మానసిక వైద్యుడిగా కనబడనున్నాడు. ఇక 'రాజు గారి గది 2' థియేట్రికల్ ట్రైలర్ లో సమంత ఆత్మ అనే విషయం రివీల్ చెయ్యడం, నాగార్జున మెంటలిస్ట్ గా పరిచయమవడం, హీరోయిన్ సీరత్ కపూర్ వెనుకవైపుగా కనిపించే గ్లామర్ షో అన్ని చూపించేశారు. అయితే సమంత ఆత్మ అనే విషయాన్నీ ఫుల్ గా రివీల్ చెయ్యకుండా జస్ట్ స్కెచ్ తో సరిపెట్టారు.

Advertisement
CJ Advs

అయితే సమంత 'రాజు గారి గది 2' లో ఎంత పవర్ ఫుల్ రోల్ చేస్తుంది అంటే.... సమంత తన పెర్ఫామెన్స్‌తో చంపేస్తుందంతే అంటూ సింగర్ చిన్మయి చెబుతున్నదానిని బట్టి చూడడమే కాదు... సమంత రోల్ కి డబ్బింగ్ చెబుతున్న సింగర్ చిన్మయికి సమంతకి డబ్బింగ్ చెప్పే టైం లో ఏడుపొచ్చేసిందట. 'రాజు గారి గది 2' సినిమాలో సమంత పాత్రకి డబ్బింగ్‌ చెబుతూ.... చిన్మయి నిజంగానే ఏడ్చేసిందట. ఈ విషయాన్ని చిన్మయి సోషల్‌ మీడియాలో  వెల్లడించింది. మరి ఇది చూస్తుంటే ఒక అమ్మాయి అనుకోకుండా చనిపోయి... దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో సమంతని చూడబోతున్నామన్నమాట.

ఈ లెక్కన 'రాజు గారి గది 2' లో కావాల్సినంత థ్రిల్లింగ్ కామెడీతో పాటే, కావాల్సినంత ఎమోషన్ సన్నివేశాలు కూడా ఉంటాయన్నమాట. మరి 'రాజు గారి గది' లో ఓంకార్ జస్ట్ థ్రిల్లింగ్ కామెడీని మాత్రమే నమ్ముకున్నాడు...అంతేకాని సినిమాలో దెయ్యాలు ఉన్నాయని ఎక్కడా క్లియర్ కట్ గా చెప్పలేదు. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ లో కూడా సమంత నిజంగా దెయ్యమా... లేకుంటే అలా నటిస్తుందా? అనేది మాత్రం సినిమా విడుదలయ్యేవరకు సస్పెన్సు లో ఉండే విషయమే. 

Singer Chinmayi About Samantha Role in RGG2 Movie!:

Akkineni Nagarjuna and Samantha key Roles in Raju Gari Gadhi 2 movie Director by Ohmkar. In this movie Singer Chinmayi dubbing for Samantha she as tells about samantha role every emotional story this movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs