Advertisement
Google Ads BL

కీర్తి... అలా చెయ్యడం జీర్ణించుకోలేక పోతున్నారు!


ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ పొజిషన్ లో కూర్చుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా కీర్తి కి మంచి ఫాలోయింగ్ వచ్చేయ్యడమే తడువు దర్శక నిర్మాతలు కీర్తి ఇంటిముందు క్యూ కట్టేసి తమ సినిమాల్లో అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఇక కీర్తి సురేష్ కూడా వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతానికి కీర్తి  సురేష్ చేతిలో తెలుగు, తమిళంలో చాలా సినిమాలే ఉన్నాయి.

Advertisement
CJ Advs

తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన, మహానటి సావిత్రి టైటిల్ పాత్రలో చేస్తున్న కీర్తి సురేష్ తమిళంలోనూ సూర్యతో తానా సెరేంద్ర కూట్టం, విక్రమ్ తో సామి2, విశాల్ తో శాండాకోజి 2 చిత్రాలలో కూడా లీడ్ రోల్స్ చేస్తుంది. కీర్తి నటించే సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలు... అలాగే స్టార్ హీరోల సినిమాలే. మరి కీర్తి చేస్తున్న సినిమాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్న సినిమాలు. ఒకేసారి ఇన్ని సినిమాలతో బిజీగా వున్న కీర్తి సురేష్ డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక నానా రకాల ఇబ్బందులు పడడమే కాదు నిర్మాతలను కూడా ఇబ్బంది పెట్టేస్తుందట.

ఇప్పటికే ఆయా సినిమాల దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ వలన స్టార్ హీరోల డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయని ఫిర్యాదు కూడా చేస్తున్నారట. మరి కీర్తి మాత్రం ఏం చేస్తుంది. తాను ఒప్పుకున్నా సినిమాలన్నీ షూటింగ్ మధ్యలో ఉండడంతో ఏం చెయ్యలేక కీర్తి అల్లాడిపోతోంది. మరి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న కీర్తి ఇలా కాల్షీట్స్ విషయంలో తమని ఇబ్బంది పెట్టడం చాలామంది నిర్మాతలు జీర్ణించుకోలేక పోతున్నారట. అందుకే కొత్త ప్రోజెక్టులలోకి కీర్తి ని అనుకున్న దర్శక నిర్మతలు ఇప్పుడు వేరే హీరోయిన్స్ ని చూసుకునే పనిలో పడ్డారట.

Actress Keerthy Suresh is Not Able to Adjust Dates!:

Keerthy Suresh is now probably the busiest actress in south India as she is part of many big movies.the actress is not able to adjust dates for all her movies.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs