Advertisement
Google Ads BL

'స్పైడర్‌' కాదు పోకిరి 2 అనాల్సింది..!


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు-రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా ఎస్‌.జె.సూర్య విలన్‌గా దేశంలోనే ప్రముఖ దర్శకుడు, దక్షిణాదిలో టాప్‌డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'స్పైడర్‌'. మరో వారం రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్‌, హారీస్‌జైరాజ్‌ అందిన సంగీతం, పాటలు అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా చిత్రం కోసం యూనిట్‌ ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌లో మహేష్‌బాబు గన్‌లో బుల్లెట్లు లోడ్‌ చేస్తున్న స్టిల్‌ కేకపుట్టిస్తోంది. 

Advertisement
CJ Advs

ఈ పోస్టర్‌ని చూస్తే నాటి మహేష్‌బాబు-పూరీ జగన్నాథ్‌ల దర్శకత్వంలో వచ్చి మహేష్‌ బాబుకి సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ని తెచ్చి, తెలుగు బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన 'పోకిరి' చిత్రంలోని స్టిల్‌ గుర్తుకు వస్తోంది. అయితే 'పోకిరి'లో మహేష్‌బాబు మాస్‌లుక్‌లో కనిపిస్తే, 'స్పైడర్‌'లో మాత్రం క్లాస్‌లుక్స్‌లో హాలీవుడ్‌ స్టార్‌లాగా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రెండు భారీ ఎపిసోడ్స్‌ హైలైట్‌గా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఎపిసోడ్స్‌లో మహేష్‌ నటనతో పాటు ఆయన లుక్‌, భారీ స్థాయిలో ఉపయోగించిన గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లు అత్యద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. 

అందుకే ముందు జాగ్రత్తగా ఈచిత్రంలోని టీజర్‌లో గానీ ట్రైలర్‌లో గానీ ఈ ఎపిసోడ్స్‌ చూపించకుండా మురుగదాస్‌ చర్యలు తీసుకున్నాడు. ట్రైలర్‌ను కూడా చాలా సాదాసీదాగా కట్‌ చేశాడు. మొత్తానికి ఈ చిత్రంలో ఐబి అధికారిగా మహేష్‌ చేసే సాహసాలు, ప్రజలను కాపాడటం కోసం ఆయన చేసే విన్యాసాలు ఈచిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సో.. వచ్చే వారంలో అంటే ఈనెల 27న చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా సంచలనాలకు తెరతీయనుంది. 

Spyder Latest Posters Sensation :

Mahesh Babu Spyder Poster Remembers Pokiri 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs