Advertisement
Google Ads BL

జై లవ కుశ కు ఫుల్ స్టాప్ పడినట్లేనా..?


గత పది రోజుల నుండి ఎవరినోట విన్న జై లవ కుశ.. జై లవ కుశ. ఆ రేంజ్ లో పబ్లిసిటీ కార్యక్రమాలను చేపట్టింది చిత్ర బృందం. ఏనోట విన్నా అదేమాట. ఏ ఛానల్ లో విన్నా అదే న్యూస్, ఏ పేపర్ చూసినా అదే వార్త, ఏ వెబ్ సైట్ చూసినా అదే కథనం... ఇక నిన్న శుక్రవారంతో జై లవ కుశ పబ్లిసిటీ కార్యక్రమాలకు స్వస్తి చెప్పేశారు చిత్ర బృందం. ఇప్పుడు జై లవ కుశ చిత్రం థియేటర్స్ లో దిగిపోయి మంచి టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ప్రమోషన్ పీక్స్ లో చేశారు కాబట్టి ఇక జై లవ కుశ వార్తలేవి మీడియాలో వెలువడవా అనే అనుమానాలు వచ్చేస్తున్నాయా అయితే ఆగండి... అక్కడే ఆగండి.

Advertisement
CJ Advs

ఇంతకీ అసలు  విషయం ఏమిటంటే ఈ దసరా రేస్ లో ఉన్న జై లవ కుశ సినిమా విడుదలైపోయింది. ఇక మహేష్ స్పైడర్ విడుదల కావాల్సి ఉంది. ఇక ఇప్పుడు పబ్లిసిటీ కార్యక్రమాలను స్పైడర్ స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇప్పటికే స్పైడర్ పబ్లిసిటీ కార్యక్రమాలు వీక్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక జై లవ కుశ థియేటర్స్ లోకి వచ్చాక ఫస్ట్ డే కలెక్షన్స్ తోనూ, జై లవ కుశ సక్సెస్ మీట్ తోనూ .. లేకుంటే థాంక్స్ మీట్  అంటూ హడావిడి చేస్తారు. ఇక ఒక వారం తర్వాత జై లవ కుశ మొదటి వారం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ అంటూ వేస్తారు. ఇక దానితో జై లవ కుశ మరుగున పడిపోతుంది.

ఇక స్పైడర్ తోపాటు ఈ దసరా బరిలో ఉన్న మరో సినిమా మహానుభావుడు పబ్లిసిటీ కూడా మొదలుపెడుతుంది చిత్ర బృందం. శర్వానంద్ - మారుతీ  తమ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే రెండు పెద్ద సినిమాల మధ్యన మహానుభావుడిని దింపుతున్నారు. మరి చిన్న సినిమాకి గట్టిగా ప్రమోట్ చేస్తే... సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ పడినా దాన్ని అందుకోవడం కష్టమే. మరి జై లవ కుశ పబ్లిసిటీ హవా ముగిసినా మళ్ళీ ఇప్పుడు స్పైడర్, మహానుభావుడు పబ్లిసిటీ హవా మొదలవుతుంది. అదన్న మాట జై లవ కుశ పనైపోయింది అనడానికి మీనింగు.

Jai Lava Kusa Publicity Sensation is Over...:

Spyder and Mahanubhavudu Movie Publicity starts 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs