Advertisement
Google Ads BL

'స్పైడర్‌' కి కూడా సెంటిమెంట్ వదలట్లే!


ప్రస్తుతం 'జై లవ కుశ' విడుదల హంగామా వుంది. దీని తర్వాత ఈనెల 27న తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు దర్శకత్వంలో మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే తమిళ ప్రేక్షకులు మురుగదాస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎస్‌.జె.సూర్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి వారు నటించిన ఈ చిత్రం సెన్సార్‌పనులను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎంతో థ్రిల్‌గా ఉందని సెన్సార్‌ సభ్యులు ప్రశంసలు కురిపించారట. ఇక మహేష్‌బాబుకి సెన్సార్‌ పూర్తికాగానే మొదటి షోని తన ఫ్యామిలీకి అంటే ఘట్టమనేని ఫ్యామిలీకి స్పెషల్‌ షో వేయించి చూపించడం సెంటిమెంట్‌.

Advertisement
CJ Advs

ఆయన సినిమాల ప్రారంభోత్సవాలకు రాకపోవడం, తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినోత్సవమైన మే31న తన కొత్త సినిమాకి సంబంధించిన ఏదో కార్యక్రమాన్ని చేయడంతో పాటు చిత్రాన్ని మొదటి సారిగా చిత్ర యూనిట్‌తో పాటు ఘట్టమనేనిఫ్యామిలీకి చూపించడం సెంటిమెంట్‌గా భావిస్తాడు. అయితే 'స్పైడర్‌' చిత్రం ప్రిస్టేజియస్‌ మూవీ కావడం, తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ కావడం, ఈ చిత్రం ద్వారానే మహేష్‌బాబు తమిళంలోకి నేరుగా ఎంటర్‌ కానుండటం ఈ చిత్రాన్ని ఇంతకు ముందు పిలవని ఫ్యామిలీ సభ్యులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. ఇక ఈ షో శని,ఆది వారాలలో ఒక రోజు ఉంటుందని అంటున్నారు. ఇక ఈచిత్రం నిడివి రెండు గంటల ఇరవై ఐదునిమిషాలు. మరి ఈచిత్రం తెలుగు నాట సరే..తమిళనాట ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచిచూడాల్సివుంది...! 

Mahesh Babu Sentiment Follows on Spyder :

Spyder Special Show for Mahesh Babu Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs