ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ థియేటర్స్ లో సందడి చేస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న జై లవ కుశ సూపర్ కలెక్షన్స్ సాధిస్తుంది అనడంలో సందేహమే లేదంటున్నారు. ఇక ఎన్టీఆర్ జై పాత్రలో ఈ సినిమాలో రెచ్చిపోయి నటించాడని... జై జై రావాణా అంటూ అందరూ జై పాత్రని మోసేస్తున్నారు. ఇక జై లవ కుశ ని వీక్షించిన పలువురు ప్రముఖులు జై లవ కుశపై ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారు. అసలు జై టీజర్ విడుదలైనప్పుడే జై పాత్రలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించడంతో పొగిడిన సెలబ్రిటీస్ ఇప్పుడు జై లవ కుశ ఫుల్ మూవీ చూశాక తమ స్పందన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
ఇక ఆ సెలబ్రిటీస్ లో అందరికన్నా ముందు రాజమౌళి- ఎన్టీఆర్ జై లవ కుశ ఫస్ట్ షో చూసి తారక్ ని ఆకాశానికెత్తేశారు. సినిమా చూశాక తనకు చాలా గర్వంగా ఉంది తారక్ అంటూ..ఏం చెప్పాలో అసలు అర్ధం కావడంలేదు.. సినిమా చూశాక మాటలు రావడం లేదు.. అని ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతే కాకుండా చివరలో జై.. జై.. జై లవ కుశ అంటూ రాజమౌళి జై లవ కుశాని ఆకాశానికెత్తేశాడు. ఇక రాజమౌళి జై టీజర్ విడుదలైనప్పుడు కూడా తనదైన శైలిలో ఎన్టీఆర్ ని పొగిడిన విషయం తెలిసిందే.