Advertisement
Google Ads BL

పెళ్లి కళ వచ్చేసిందే బాలా...!


సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే జనతా గ్యారేజ్ తర్వాత సమంత నటించిన సినిమాలేమి ఇంతవరకు విడుదల కాలేదు . అయితే నిత్యం పెళ్లి వార్తలతోనైనా లేకుంటే చేనేత వస్తాలకు బ్రాండ్ అంబాసిడర్ గా... ఆ చేనేత వస్త్రాల పబ్లిసిటితోనైనా, అలాగే చేతినిండా సినిమాల్తో బిజీగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలోనూ, పార్టీలలోనూ హాట్ హాట్ డ్రెస్సులు ధరించి రెచ్చిపోతూనే వుంది. సమంత నటిస్తున్న రెండు మూడు తెలుగు సినిమాలు ప్రస్తుతానికి సెట్స్ మీదున్నాయి. రామ్ చరణ్ తో రంగస్థలం, మామగారు నాగార్జున కీ  రోల్ లో నటిస్తున్న రాజు గారి గది 2 లోనూ, మహానటి సావిత్రి బయోపిక్ మహానటిలోను నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక అక్టోబర్ 6 న నాగ చైతన్యతో జరగబోయే పెళ్లి పనులతోను సమంత షాప్పింగ్స్ వంటి పనులతో ఫుల్ బిజీగా ఉందనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో సమంత పెళ్లి ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. సమంత తన పెళ్లి డ్రెస్ ని ట్రైల్స్ వేస్తుంది... ఇప్పుడా  ఫోటో షూట్ ఫొటోస్ నెట్ లో కనబడుతున్న ఫొటోస్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఆ ఫోటొస్ లో సమంత చాలా అందంగా, అలాగే హాట్ గా, కాస్త డిఫరెంట్ లుక్ లో పెళ్లి కళ వచ్చేసిందే బాలా... అన్నట్టు అందంగా కనబడుతుంది. 

మరి పెళ్లి డ్రెస్ అయితే అంత హాట్ గా చూపించాల్సిన అవసరం లేదంటున్నారు. మరి చాలా అందంగా కనిపిస్తూ ఆ డ్రెస్ లో అందాల ఆరబోతతో సమంత చూపరుల మతులు పోగొడుతుంది.  నిజంగానే సమంత తన పెళ్లి డ్రెస్సులు ట్రయిల్ షూట్ లో ఉందా? లేకుంటే పెళ్లి టైం కి అలాంటి ఫోటో షూట్ జరగడంతో అవి పెళ్లి డ్రెస్సులంటూ ప్రచారం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే సమంత - నాగ చైతన్య ల పెళ్లి అక్టోబర్ 6 న గోవాలో జరుగుతుండగా.. హైదరాబాద్ లో అక్టోబర్ 10 న వీరి రిసెప్షన్ జరగనుంది.

Samantha New Photoshoot for Her Wedding!:

Samantha gears up for wedding, shares a glimpse of her bridal look.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs