ప్రభాస్ బాలీవుడ్ లో ఒక స్ట్రయిట్ సినిమా చేస్తాడంటూ చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రభాస్ మాత్రం వాటిని ఖండించకుండా ఉండిపోయాడు. అయితే ఇపుడు మాత్రం తన హిందీ డెబ్యూ పై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. 2019లో తన బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశాడు. బాలీవుడ్ లో ఒక స్ట్రయిట్ మూవీ చేస్తున్నానని... అయితే ఆ చిత్రం 2018 చివర్లో గాని... లేదా 2019 లో ప్రారంభం అవుతుందని చెబుతున్నాడు. ప్రస్తుతం సుజిత్ దిరెచ్తిఒన్ లో సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
ఇక సాహో చిత్రాన్ని కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాహుబలితో బాలీవుడ్ బాక్సాఫీసుని దడదడ లాడించిన ప్రభాస్ సాహో తో కూడా బాక్సాఫీసుని దున్నేయాలని చూస్తున్నాడు. ఇక సాహో చిత్రం పూర్తి కాగానే జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక ప్రేమ కథా చిత్రానికి కమిట్ అయ్యాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే హిందీలో నేరుగా సినిమా చేస్తానని చెబుతున్నాడు ప్రభాస్. అయితే ప్రస్తుతానికి ఆ బాలీవుడ్ సినిమాకి దర్శకుడు ఎవరు, కథేంటి లాంటి విషయాలు ఇంకా ఓకే అవ్వలేదు.
అయితే ఆ బాలీవుడ్ చిత్రానికి మాత్రం నిర్మాత కచ్చితంగా కరణ్ జోహారే ఉంటాడు. ఈ మేరకు ప్రభాస్ - కరణ్ జోహార్ ల మధ్య ఒప్పందం కూడా కుదిరిందనే న్యూస్ ఉండనే వుంది. మరి ఇప్పటికే రామ్ చరణ్, రానా లాంటి యంగ్ హీరోస్ బాలీవుడ్ లో తమ లక్ చెక్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ప్రభాస్ కూడా ఇదే రూట్లో ఉన్నాడన్నమాట. చూద్దాం ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా వుండబోతుందో..!