Advertisement
Google Ads BL

100 అంటూ నిజంగా షాకే ఇచ్చిందిగా!


'అర్జున్‌రెడ్డి' చిత్రంలో విజయ్‌ దేవరకొండ మాత్రమే కాదు.. హీరోయిన్‌ షాలిని పాండే కూడా తన పాత్ర, నటనతో మెస్మరైజ్‌ చేసింది. పద్దతిగా, సైలెంట్‌గా ఉంటూనే బోల్డ్‌ నెస్‌ని చూపించడమంటే చిన్న విషయంకాదు. కాగా ప్రస్తుతం ఆమె తమిళంలో '100%లవ్‌' చిత్రం రీమేక్‌లో నటిస్తోంది. ఇక ఈమె ఇటీవల తన వందో ట్వీట్‌తో ఆనంద పరుస్తానని చెప్పిన ఈ భామ అనుకున్నంత పని చేసింది. ఈమె తాజాగా ఓ పిక్‌ని పోస్ట్‌ చేసింది. ఓ పిక్‌ మాత్రమే ఆనందించే విషయం ఎలా అవుతుందనే డౌట్‌ వద్దు. ఆమె పోస్ట్‌ చేసిన పిక్‌ సావిత్రి బయోపిక్‌గా తీస్తున్న 'మహానటి' చిత్రంలోనిది. 

Advertisement
CJ Advs

ఈ పిక్‌లో ఆమె మొహానికి మేకప్‌ టచెస్‌ ఇస్తుండగా, పక్కన సావిత్రి గెటప్‌లో కీర్తిసురేష్‌ ఇరగదీస్తోంది. ముందుగా అనుకున్నట్లు ఈచిత్రంలో షాలిని పాండే చేస్తున్న పాత్ర జమునదేనని చెప్పవచ్చు. చాలాకాలంగా 'మహానటి' చిత్రంలో నటిస్తున్న కీర్తిసురేష్‌ సావిత్రి గెటప్‌ ఇవేనంటూ ఎన్నో ఫొటోలు వచ్చాయి. కానీ అవన్నీ అఫీషియల్‌ ఫొటోలు కాదు. దానిలో ఒక్క ఫొటో మాత్రమే సావిత్రి గెటప్‌లో ఉన్నట్లు అనిపించింది. కాగా ఇటీవల తాజాగా ఇదే 'మహానటి'లోని సావిత్రి పాత్రను చేస్తున్న కీర్తిసురేష్‌ గెటప్‌ అని వార్తలు వచ్చానా దానికి కీర్తిసురేష్‌ ఖండించింది. అది ఓ షాపింగ్‌మాల్‌కి చెందిన ఫొటో అని క్లారిటీ ఇచ్చేసింది. 

మొత్తానికి కీర్తిసురేష్‌ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ చిత్రంతో పాటు 'మహానటి'లో నటిస్తోంది. షాలినిపాండేకి 'అర్జున్‌రెడ్డి' విడుదలైన తర్వాత అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె ఏ చిత్రం పడితే దానిని ఒప్పుకోవడం లేదు. తమిళ్‌లో '100%లవ్‌', తెలుగులో 'మహానటి'లో నటిస్తోంది. 

Shalini Pandey 100th Tweet Sensation:

Shalini Pandey Tweeted her Mahanti Movie Role Pic 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs