Advertisement
Google Ads BL

రంగస్థలం సెట్స్ లో రాజమౌళి- రీజన్ ఇదేనా?


సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ - సమంత జంటగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక రంగస్థలం షూటింగ్ అక్టోబర్ చివరికల్లా పూర్తి చేసి ప్లాన్ లో చిత్ర బృందం వుంది. అయితే ఈ మద్యలో రామ్ చరణ్ తన తండ్రి 'సై రా' చిత్ర నిర్మాత కావటం వల్లను.... సమంత పెళ్లి విషయంలోనూ కాస్త డిలే అవనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న రంగస్థలం సెట్స్ లో దర్శకధీరుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి తళుక్కుమన్నారు.

Advertisement
CJ Advs

చిరంజీవి, రామ్ చరణ్ కి తండ్రి కాబట్టి రంగస్థలం సెట్స్ కి వెళ్ళాడులే అనుకుంటే బాహుబలితో కీర్తి ప్రతిష్టలు అందుకున్న రాజమౌళి, చరణ్ రంగస్థలం సెట్స్ లోకి ఎందుకెళ్లారో అనుకుంటూ తెగ చర్చేసుకుంటున్నారు జనాలు. మరి అక్కడ మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి రంగస్థలం షూటింగ్ స్పాట్ లో చేసిన సందడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే రాజమౌళి, బాహుబలి తర్వాత ఎటువంటి సినిమా చెయ్యకుండా ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి లో ప్లానింగ్ కమిటీకి సలహాలు ఇచ్చే పనిలో ఉన్నాడు.

ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ రంగస్థలం సెట్స్ లో రాజమౌళి కనబడేసరికి అందరూ మగధీర 2  కోసమే రాజమౌళి ఇలా రామ్ చరణ్ దగ్గరికి వెళ్లాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్లేందుకు వెళ్లారో గాని జనాలు మాత్రం తలో రకంగా ఊహించేసుకుంటున్నారు.

Chiranjeevi and SS Rajamouli at Rangasthalam Sets:

Here is a rare pic of sorts! Megastar Chiranjeevi and ace director SS Rajamouli were caught in a fantastic moment they had at Rangasthalam 1985 sets.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs