ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో సందడికి చెయ్యడానికి రెడీగా వుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుండే మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వస్తుంది. ఆ అంచనాలను జై టీజర్, లవ టీజర్ సినిమా ఫస్ట్ లుక్, జై లవ కుశ ట్రైలర్ తోనూ ఇంకా అంచనాలు పెంచుకుంటూ పోయింది. ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం చెయ్యడం, ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో కనబడటం వంటి అంశాలతో ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ముందు నుండే ప్రమోషన్ విషయంలో మంచి ప్లానింగ్ లో ఉన్న జై లవ కుశ విడుదల సమయం దగ్గరికి వచ్చేసరికి అదిరిపోయే ప్రమోషన్ తో దూసుకుపోతుంది.
ఇక ఈ దసరా సెలవలని ఒక వారం పాటు క్యాష్ చేసుకోవాలనే జోష్ తో జై లవ కుశ విడుదలకు సిద్దమయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి అన్ని కలిసొచ్చేలాగే కనబడుతున్నాయి. ఎందుకంటే దసరా సెలవలు మొదలైపోయాయి. అలాగే జై లవ కుశ బుకింగ్స్ కూడా అదిరిపోయే లెవల్లో జరగడంతో.... ఓపెనింగ్స్ విషయంలో ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చేలాగా కనబడుతుంది. ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభంలోనే 75 శాతం ఆక్యుపెన్సీ దక్కినట్లు చెబుతున్నారు. ఇక టిక్కెట్ల కోసం తాకిడి పెరగడంతో యుఎస్ లో జై లవ కుశకు స్క్రీన్స్ సంఖ్య పెంచేసినట్లు కూడా తెలుస్తుంది.
మరి మొదటినుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ జై పాత్రతో ఇరగదీశాడనే టాక్ పీక్స్ లో ఉంది. అందుకే సాధారణ ప్రేక్షకుడు కూడా ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. జై యాక్షన్, లవ, కుశ కామెడీ ట్రాక్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నదమ్ములు తారక్, కళ్యాణ్ రామ్ లు బాగా నమ్ముతున్నారు. చూద్దాం మరి కొన్ని గంటల్లో జై లవ కుశ జాతకమేమిటో తేలిపోతుంది.