Advertisement
Google Ads BL

రాజు గారి గదిలో ఉన్నదెవరో తెలిసింది..!


ఓం కార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది చిన్న సినిమా వచ్చి చితకబాదేసిన విషయం తెలియసందే. ఆ సినిమా వచ్చి చాలా కాలం అయినప్పటికీ రాజుగారి గది మా ఛానల్ లో వస్తుంది అంటే ఇప్పటికీ పిల్లలు టీవీ లకు అతుక్కుపోయారు అంటే ఆ సినిమాలో భయాన్ని

Advertisement
CJ Advs

కలిగించే థ్రిల్లింగ్ కామెడీకి కొదవ లేకపోవడమే. ఇప్పుడు ఆ రాజుగారి గది కి సీక్వెల్ గా రాజుగారి గది 2  ని ఓం కార్ తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ చిత్రం మళ్లీ రాజు గారి గది లోని నటీనటులే నటిస్తే పెద్దగా హైప్ వచ్చేది కాదేమో. కానీ ఇప్పుడు ఈ చిత్రంలో నాగార్జున, సమంతలు నటిస్తున్నారు అనే సరికి ఈ చిత్రం పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.  

ఇక అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు కానుకగా నాగార్జున నటించిన రాజు గారి గది 2 ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో మొదటి నుండి అనుకుంటున్నట్టే నాగార్జున సైకాలజిస్ట్ గా కనబడుతున్నాడు. ఇక స్టోరీలోకి వస్తే బీచ్ లో ఉన్న ఒక రిసార్ట్ లో ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతూ షకలక శంకర్, వెన్నల కిషోర్, ఓంకార్ తమ్ముడు అశ్విన్ లను భయపెడుతుంటుంది. అయితే బీచ్ లో ఉన్న దెయ్యాన్ని పారదోలాలంటే గనక ఒక వ్యక్తిని కలవడానికి వెళ్లాలని ఫాదర్ కేరెక్టర్ లో ఉన్న సీనియర్ నరేష్ చెప్పడంతో.. కథ నాగార్జున వద్దకు చేరడం నాగార్జున ఏమో పూజలు చేపిస్తూనే అంటే దేవుడిని నమ్ముతూనే ఆత్మలని ఎలా వెళ్ళగొట్టాలో చెబుతుంటాడు. ఇక ఆ బీచ్ రిసార్ట్ లో ఒక అమ్మాయి ఆత్మ ఉందని చెబుతూనే ఒక డ్రాయింగ్ వెయ్యడం.... ఆ డ్రాయింగ్ లో నాగార్జున,సమంత బొమ్మను గియ్యడం చూపించారు. మరి ఈ లెక్కన ఆ అమ్మయి ఆత్మ ఎవరనేది స్పష్టంగా చూపించకపోయినా అది సమంతానే అని అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో సమంత ఎలా భయపెడుతుందనే అనేది సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో థ్రిల్లర్ కామెడీ కూడా రాజుగారి గది నే తలపిస్తుంది గాని... నాగార్జున మానసిక నిపుణుడిగా, సమంత ఆత్మగా ఈ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్. అలాగే ఈ సినిమాకి హీరోయిన్ సీరత్ అందాలు కూడా ప్రధాన ఆకర్షణే. ఎందుకంటే సీరత్ బయట హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అందరిమతులు పోగొట్టేసింది. మరి బయటే అలాగుంటే... ఇక సినిమాలో ఇంకెలా రెచ్చిపోతుంది. అందుకే డైరెక్ట్ గా సీరత్ ని చూపెట్టకుండా వెనుకభాగం నుండి చూపెట్టి  దర్శకుడు కాస్త క్యూరియాసిటీని పెంచాడు. ఇక రాజుగారి గది 2  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా సూపర్బ్ అనిపించాడు. ఇక ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది.

Click Here See The Raju Gari Gadhi 2 Movie Trailer:

Raju Gari Gadhi 2 Trailer Review!:

Raju Gari Gadhi 2 is one of the most awaited projects of the year having Nagarjuna in central mentalist character while Samantha is into the spooky revenge seeking evil spirit role.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs