Advertisement
Google Ads BL

ఒకే ఒక్క హిట్‌ అంటోన్న భామ..!


రాశి ఖన్నా.. ఈమె దాదాపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి అటు ఇటుగా పరిచయమైంది. కానీ రకుల్‌ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ అయింది. కానీ రాశిఖన్నా మాత్రం మీడియం రేంజ్‌ హీరోలతో.. అదీ సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలకే పరిమితమవుతోంది. కెరీర్‌ మొదట్లో కాస్త హద్దుల్లోనే ఉంది.పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ పాత్రలు చేయలేదు. అందమైన ఈ భామ తమకు కావాల్సిన విధంగా ఎక్స్‌పోజ్‌ చేయదనే సంశయంతో ఆమెకు పెద్ద చిత్రాలలో అవకాశాలురాలేదు. 

Advertisement
CJ Advs

ఈ బబ్లీ బ్యూటీ మంచి సింగర్‌ కూడా. పరభాషా నటి అయినా కూడా తెలుగువారి కంటే బాగా పాటలు పాడగలదని నిరూపించుకుంది.ఈమె ఖాతాలో మంచి హిట్సే ఉన్నప్పటికీ 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అనే సామెత ఈ భామకు సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆమెకి అసలైన పరీక్ష ఎదురవుతోంది. ఈ భామ నివేదా థామస్‌తో పాటు ఎన్టీఆర్‌ సరసన 'జై లవ కుశ'లో నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర పేరు ప్రియ. ఎన్టీఆర్‌ నటించిన మూడు పాత్రల్లో ఒకటైన మంచివాడైన లవ కుమార్‌ పాత్రకు ఈమె లవర్‌. తను మ్యారేజ్‌ బ్రోకర్‌గా ఇందులో నటిస్తున్నట్లు తెలిపింది. 

తనకు లవ కుమార్‌ పాత్రకు మద్య వచ్చే సీన్స్‌ ఎంతో రొమాంటిక్‌గా ఉండటమే కాదు... మంచి కామెడీని కూడా పంచుతాయట. ఇక ఈ చిత్రంలో ఆమె గ్లామర్‌,నటన నచ్చితే... సినిమా పెద్ద హిట్‌ అయితే ఇక ఈ అమ్మడిపై స్టార్‌ హీరోల కన్నుపడుతుంది.ఇక ఈమె ఈనెలలో 21న 'జై లవ కుశ'తో వస్తుండగా, వచ్చేనెల 'రాజా ది గ్రేట్‌' చిత్రంతో రానుంది. ఒక సినిమాలో ఎన్టీఆర్‌,రెండో సినిమాలో దిల్‌రాజు. మరి వీరిద్దరిలో ఆమెకు హిట్‌బాట చూపేది ఎవరో చూడాల్సివుంది..!

Raashi Khanna Hoped Only One Hit Movie!:

Raashi Khanna starring two major movies are Jai Lava Kusa and Raja The great.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs