దక్షిణాది దర్శకుల సత్తాను దేశ వ్యాప్తంగా ఎగుర వేయడంలో లెజెండరీ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ మణిరత్నం పేరును ముందుగా చెప్పుకోవాలి. గతంలో ఆయన చిత్రాలలో నటించేందుకు షారుఖ్ ఖాన్, అమితాబ్, అభిషేక్, ఐశ్వర్యారాయ్, రజినీకాంత్, మమ్ముట్టి,కమల్ హాసన్, నాగార్జున, విక్రమ్ వంటివారు ఎగిరి గంతేసేవారు. కానీ గత కొంతకాలంగా ఆయన పరిస్థితి బాగాలేదు. 'రావణ్, కడలి, చెలియా' వంటి చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
కేవలం 'ఓకే బంగారం' మాత్రమే ఫర్వాలేదనిపించింది. అప్పటికే మణి ఫ్లాప్‌లలో ఉండటంతో 'ఓకే బంగారం' కోసం మణిరత్నం రామ్ చరణ్‌ని అడిగితే నో చెప్పేశాడు. దాంతో దుల్కర్ సల్మాన్‌ని పెట్టుకున్నాడు. ఇక మణిరత్నం తనకు గురువని,ఆయన దర్శతకత్వంలో తన జీవితంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని చెప్పిన నాని 'ఓకే బంగారం'లో దుల్కర్ సల్మాని డబ్బింగ్ చెప్పి ఆ జీనియస్ సినిమాకి డబ్బింగ్ చెప్పినా చాలని చెప్పాడు. కానీ చేతల్లోకి వచ్చేసరికి 'చెలియా' చిత్రంలో నటించమంటే డేట్స్ ప్రాబ్లమ్ అని చెప్పి 'నో' చెప్పాడు.
ఇక కార్తితో చేసిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక 'ఓకే బంగారం' లో హ్యాండ్ ఇచ్చిన రామ్ చరణ్ తాను 'ధృవ' నుంచి 'రంగస్థలం 1985' వంటి విభిన్న చిత్రాలు చేయడానికి మణిగారు ఇచ్చిన సలహానే కారణమని, పెద్దయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని వైవిధ్యభరితమైన చిత్రాలు చేయాలని మణి ఇచ్చిన సలహాతోనే తాను వైవిధ్య పాత్రలు చేస్తున్నానని చెప్పాడు. ఇక రామ్ చరణ్ హీరోగా తెలుగు, తమిళం,హిందీ భాషల్లో ఓ చిత్రం చేయాలని మణి భావించినా రామ్ చరణ్ పట్టించుకోవడం లేదంటారు.
ఇక మణిరత్నం స్టోరీలైన్‌ని, కథను విని ఆయనకు ఓ చిత్రం చేస్తానని చెప్పిన మహేష్‌బాబు కూడా మౌనంగా ఉన్నాడు. ఇక తాజాగా మణి నలుగురు యంగ్ హీరోలతో ఓ చిత్రం ప్లాన్ చేశాడు.మొదట ఈ నలుగురు హీరోలలో ఒకడిగా నటించడానికి నాని ఓకే చెప్పినా, వరుస విజయాలలో ఉన్న తాను వరుస పరాజయాలలలో ఉన్న మణితో చిత్రం చేయడం మంచిది కాదని డ్రాప్ అయ్యాడట. ఈ చిత్రం జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుంది.
దీంతో నాని తనకు డేట్స్ ప్రాబ్లమ్ అని తప్పుకున్నాడు. దాంతో నాని బదులు ఎవరిని తీసుకోవాలా? అనే ఆలోచనలో మణి ఉన్నాడు. ఇక్కడ మణికి నో చెప్పడం తప్పుకాదు. కానీ చేస్తామని చెప్పి, కథ విని, అందులో మార్పులు చేయించి, చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం చూస్తే మాత్రం ఆయనను ఈ హీరోలు అవమానిస్తున్నారేమో అనిపిస్తోంది.