Advertisement
Google Ads BL

ఈ సినిమా అయినా హిట్‌ కొడుతుందా..?


కనీసం ఏడాదికి నాలుగైదు చిత్రాలలో నటించే మినిమం గ్యారంటీ ఉన్న హీరో మాస్‌ మహారాజా రవితేజ. కాగా ఆయన తన కెరీర్‌ మొదట్లో 'నీ కోసం, సింధూరం, ఖడ్గం, నా ఆటోగ్రాఫ్‌, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' వంటి కొన్ని వైవిధ్యభరితమైన పాత్రలే చేశాడు. వీటిలో తన ఇమేజ్‌ని పక్కన పెట్టి చేసిన ప్రయోగం కేవలం 'నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌'. ఇక ఈయన 'బెంగాల్‌ టైగర్‌' తర్వాత తన ఫేసులో మునుపటి గ్రేస్‌ తగ్గడంతో,వరుస పరాజయాలతో చాలా గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు వరుసగా చిత్రాలు ఒప్పుకుంటున్నాడు. 

Advertisement
CJ Advs

దిల్‌రాజు - అనిల్‌ రావిపూడిలతో ఆయన గుడ్డివానిగా నటిస్తున్న 'రాజా ది గ్రేట్‌', దీని తర్వాత విక్రమ్‌ సిరికొండతో చేసే 'టచ్‌ చేసి చూడు'లతో పాటు ఓ రీమేక్‌కు కూడా ఓకే చెప్పాడు. కానీ ప్రేక్షకులు,ఆయన అభిమానులే కాదు... స్వయంగా రవితేజ కూడా 'రాజా ది గ్రేట్‌' చిత్రం పైనే పెట్టుకున్నాడు. ఇందులో రవితేజ గుడ్డివాడిగా నటిస్తున్నా కూడా ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ సినిమా అని యూనిట్‌ చెబుతోంది. ఇక దిల్‌రాజుకు వరుసగా వస్తున్న సక్సెస్‌లు, ఆయన జడ్జిమెంట్‌ నమ్మకం ఉన్నవారు...మామూలు కథలనే ప్రేక్షకులు మెచ్చేరీతిలో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే అనిల్‌ రావిపూడిల వల్ల ఈ చిత్రంపై అందరికి గట్టినమ్మకమే ఉంది. 

ఇక ఇటీవలే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్ర యూనిట్‌ తాజాగా ఈ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ లిరికల్‌ సాంగ్‌కి సాయి కార్తీక్‌ సంగీతం అందించాడు.కాకర్ల శ్యామ్‌ రాసిన ఈపాటలో రవితేజ కూడా సెంటిమెంట్‌గా తన గొంతుని కూడా వినపించాడు. రవితేజ, రేవంత్‌, సాకేత్‌లు నటించిన ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి దీపావళికానుకగా విడుదల చేయనుండగా, ఇందులో మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Raja the Great Title Song Released:

Mass Maharaj Ravi Teja's new film 'Raja the Great' title song was unveiled by the makers released yesterday.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs