Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ కూడా భయపడుతున్నాడు..!


'టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌' వంటి హ్యాట్రిక్‌ హిట్స్‌ ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ నటించిన 'జై లవ కుశ' చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చితం ప్రీమియర్‌ షోలు రేపు రాత్రి నుంచే మొదలవుతున్నాయి. దీంతో నందమూరి ఎన్టీఆర్‌ జూనియర్‌ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. పలు చోట్ల భారీ ధరలకు టిక్కెట్లను అమ్ముతున్నారు. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ చిత్రం అవుతుందని యూనిట్‌, నిర్మాత కళ్యాణ్‌ రామ్‌తో సహా ఎన్టీఆర్‌ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా ఈ చిత్రంలోని 'జై' పాత్ర తీరుతెన్నులు తనను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయని, సినిమా షూటింగ్‌ పూర్తయిన తాను జై పాత్ర ఎఫెక్ట్‌ నుంచి చాలా కాలం బయటకు రాలేకపోయానని అంటున్నాడు. సహజంగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్‌కే సాధ్యం. అలా పరకాయ ప్రవేశం చేసిన షూటింగ్‌ అయిపోయిన వెంటనే ఆయన అసలు మూడ్‌లోకి వచ్చేస్తాడు. కానీ 'జై' పాత్ర మాత్రం తనను బాగా వెంటాడిందని, ఈ పాత్ర నుంచి బయట పడటానికి తనకు బిగ్‌బాస్‌ షో సహాయం చేసిందని చెప్పుకొచ్చాడు. 

ఆ పాత్ర తనకు బాగా ఇంకా చెప్పాలంటే విపరీతంగా నచ్చడం, బాబి నెరేషన్‌.. ఈ రెండు కారణాల వల్లనే తాను ఈ చిత్రం చేశానని, ఈ చిత్రం తన సోదరులకు, వారి కుటుంబాలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌ రామ్‌తో ఓ చిత్రం చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నానని, ఆ కోరిక అనూహ్యంగా ఈ చిత్రం ద్వారానే లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు. మొత్తానికి మరిన్నిగంటల్లో నందమూరి అభిమానులు, మరీ ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగ మొదలవ్వనుంది. 

Jr NTR Says About Jai Role!:

After completing the shooting, he says that he has not been able to come out of Jai's effect.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs