Advertisement
Google Ads BL

బుల్లి ఎన్టీఆర్ ఇలా అంటున్నాడు..!


ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ ఎల్లుండి అంటే ఈ గురువారమే థియేటర్స్ లో దిగిపోనుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో జై లవ కుశ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెబుతూ వస్తున్నాడు. జై పాత్ర కోసం తాను చాలా శ్రమించానని... ఆ పాత్ర షూటింగ్ అయ్యాక కూడా జై పాత్రలో నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక జై లవ కుశ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ భీభత్సంగా పాల్గొంటున్నాడు. పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఎన్టీఆర్ ఇదివరకెన్నడూ తన సినిమా ప్రమోషన్స్ లో ఇంతిలా పాల్గొన్న సందర్భాలు అయితే లేవు. అంటే అన్న కళ్యాణ్ రామ్ బ్యానర్ లో సినిమా చేశాడు కాబట్టి ఈ సినిమాని వీరలేవుల్లో ప్రమోషన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.

Advertisement
CJ Advs

అయితే అదంతా ఏం లేదుగాని.... ఎన్టీఆర్ ఇదివరకటిలా కాదు..... ఇప్పుడు చాలా మారాడు అనే పదం కూడా ఎప్పటినుండో వినిపిస్తూనే వుంది. మీడియాతో ఎన్టీఆర్ మాట్లాడే తీరు కూడా చాలా వరకు మారిందనే ప్రచారము ఉంది. ఇకపోతే ఎన్టీఆర్ ఈ జై లవ కుశ చిత్రాన్ని కేవలం అన్నదమ్ముల అనుబందంకోసమే చేశానని... ఈ చిత్రం ఫామిలీస్ కి బాగా నచ్చుతోందని చెబుతున్నాడు.  ఇలాంటి సినిమాని తన అన్న కళ్యాణ్ సొంత బ్యానర్ లో చెయ్యడం తన అదృష్టమని చెబుతున్నాడు. ఇక ఈ సినిమా చెయ్యడానికి తన భార్య లక్ష్మి ప్రణతి, తన తల్లి ఎంతో సపోర్ట్ చేశారని.... తన జీవితంలో ఈ ఇద్దరి ఆడవాళ్ళ వలెనే తానెంతో సంతోషంగా వున్నానని కూడా చెప్పాడు. అలాగే తన కోడు అభయ్ రామ్ ఎలా కావాలంటే అలా తయారు చేస్తానని.... బలవంతంగా హీరో అవ్వమని తాను చెప్పానని చెబుతున్నాడు. అలాగే అభయ్ కి సినిమాలు ఎక్కువగా చూపించమని... అయితే జై లవ కుశ చేస్తున్నప్పటి నుండి అభయ్  జై ... రావణా... జై జై రావణా అంటున్నాడని చెబుతున్నాడు.

ఇక ఇటు జై లవ కుశ సినిమాతో పాటే బుల్లితెర మీద కూడా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక బుల్లితెర మీద ఎన్టీఆర్ పెరఫారెమెన్స్ చూసిన అందరూ ఎన్టీఆర్ కి అభిమానులుగా మారిపోతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ వన్ ముగిసే సమయం ఆసన్నమవడంతో ఎన్టీఆర్ హోస్టింగ్ ని మిస్ అవుతున్నామని ఫీలింగ్ లో ఎన్టీఆర్ అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కొట్టుమిట్టాడుతున్నారు.

Jr NTR About His Son Abhay Ram!:

Jr NTR acted Jai Lava Kusa Movie director by Bobby. NTR said, Abhay Ram saying Jai Ravana Jai Jai Ravana.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs