Advertisement
Google Ads BL

బెయిల్ కూడా ఇవ్వకుండా కోర్టు ఏడిపిస్తుంది..!


మలయాళ స్టార్ హీరో దిలీప్ కుమార్ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఆయన జైల్లో కూర్చుని బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ... కోర్టు మాత్రం ఆయనకి బెయిల్ ఇవ్వడంలేదు. ఒకసారి కోర్టు బెయిల్ నిరాకరించినప్పటికీ మళ్లీ దిలీప్ కుమార్ బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశాడు. ఈలోపు బయట దిలీప్ కుమార్ రెండో భార్య కావ్య మాధవన్ కూడా ఈ కేసులో ఇరుక్కునేలానే ఉంది. భావనని కిడ్నాప్ చేసి... లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఆ ఉదంతాన్ని ఫొటోస్, వీడియోస్ రూపంలో తయారు చేసి భావనని బ్లాక్ మెయిల్ చెయ్యాలని దిలీప్,కావ్యలు, భావనని కిడ్నాప్ చేయించారనే ఆరోపణలున్నాయి. ఇక దిలీప్ మీద కేసు మాత్రం స్ట్రాంగ్ గా వుంది ఆయనకి బెయిల్ కూడా ఇవ్వకుండా కోర్టు ఏడిపిస్తుంది.

Advertisement
CJ Advs

అక్కడ జైల్లో  బెయిల్ కష్టాలు పడుతున్న దిలీప్ బయట తన సినిమా విడుదల విషయంలో కూడా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. దిలీప్ కుమార్ ‘రామ్ లీలా’ ఈ నెల 28 న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడమే తరువాయి... దిలీప్ నటించిన ‘రామ్ లీలా’ ని విడుదల కానివ్వమని... ఆ సినిమాని నిలిపివేయాలని.. మలయాళ ఇండస్ట్రీలోని కొద్దిమంది సెలబ్రిటీస్ తోపాటు మహిళా సంఘాల ఆందోళన కూడా స్టార్ట్ అయ్యింది. ఇక సినిమా విడుదల ఎలా చేస్తారో చూస్తామంటూ ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసన గళాలు వినిపిస్తున్నాయి. భావన కిడ్నాప్ కేసులో నిందితుడుగా ఉన్న దిలీప్ సినిమాని కేరళలో ఆడనివ్వమంటున్నారు. ఇక నిర్మాతలేమో ఎలాగైనా సినిమాని 28 కె విడుదల చెయ్యాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇంతకూ ముందు నుండే ‘రామ్ లీలా’ సినిమా విడుదల కష్టాలు అనుభవించింది. ఇక ఈ నెగటివ్ పబ్లిసిటీ సినిమా ఓపెనింగ్స్ కి బాగా పనికొస్తాయని ‘రామ్ లీలా’ నిర్మాతలు ఆశతో ఉన్నారు. చూద్దాం సినిమా విడుదల జరుగుతుందా? లేకుంటే ఆపేస్తారా? అనేది.

Malyalam Star Hero Dileep Kumar!:

The Strong case on Dileep Kumar and the court will not give him a bail.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs