గురు తర్వాత వెంకటేష్ ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ లేకుండానే గడిపేస్తున్నాడు. గురు హిట్ తర్వాత వెంకటేష్ నుండి ఎలాంటి సినిమా రాబోతుంది అంటూ వెంకీ అభిమానాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నకొద్దీ వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వెనక్కి వెళుతూనే వుంది. అయితే వెంకటేష్ రొటీన్ సినిమాలను పక్కనపెట్టి తన వయసుకు తగ్గ పాత్రలు.... ఈ జనరేషన్ కు నచ్చే కథ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే గురు సినిమా తర్వాత వెంకటేష్ చాలా కథలనే విన్నాడట. చాలామంది దర్శకులు వెంకీ ని అప్రోచ్ అయ్యి కథలను చెప్పినట్లుగా వార్తలొస్తూనే వున్నాయి.
బొమ్మరిల్లు వంటి కుటుంబ కథ చిత్రంతో ఇండస్ట్రీలో విజకేతనం ఎగురవేసిన బొమ్మరిల్లు భాస్కర్ తో వెంకీ సినిమా దాదాపు ఫైనల్ అయినట్టుగా... కొద్దీ రాజుల్లో సెట్స్ మీదుకెళ్లబోతున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. అయితే తర్వాత భాస్కర్ - వెంకటేష్ కలయికలో తెరకెక్కే చిత్రం మాత్రం హోల్డ్ లో పడింది అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం రానా కి నేనే రాజు - నేనే మంత్రి సినిమా హిట్ ఇచ్చిన దర్శకుడు తేజకి రామానాయుడు స్టూడియోస్ నుండి ఫోన్ కాల్ వచ్చినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సురేష్ బాబు నిర్మాతగా వెంకీ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతోందని న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.
చాలా తక్కువ అంటే లిమిటెడ్ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమా షూట్ ఫినిష్ చేసే తేజ.... ఇప్పుడు వెంకటేష్ తో కూడా ఒక లిమిటెడ్ బడ్జెట్ మూవీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడని టాక్. మరి ఇది గనక అధికారికంగా ప్రకటన ఇస్తే.... ఇప్పటివరకు బాలయ్య - తేజ మూవీ కలయికలో సినిమా వుండనై ప్రచారం జరుగుతుంది... ఇక ఆ సినిమా మాత్రం లేనట్లే. ఎందుకంటే బాలయ్య నుండి కూడా తేజకి ఫోన్ కాల్ వచ్చినట్టుగా కూడా వార్తలొచ్చాయి.