Advertisement
Google Ads BL

బాలయ్య వర్సెస్ వర్మ!!


కాంట్రవర్సీ కింగ్ మళ్లీ లైన్ లోకొచ్చాడు. మొన్నటి వరకు 'అర్జున్ రెడ్డి' విషయంలో వీరలెవల్లోరెచ్చిపోయి వీహెచ్ బట్టలు చించమన్న ఆర్జీవీ ఇప్పుడు మరోసారి ట్విట్టర్ వేదికగా తన పైత్యం చూపెట్టడానికి రెడీ అయ్యాడు. 'అర్జున్ రెడ్డి' ట్వీట్స్ కి ముందు 'ఎన్టీఆర్ బయో పిక్' తానే తీస్తున్నానని ఛానల్స్ లో, సోషల్ మీడియాలో రక రకాలా స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. ఇక ఆర్జీవీ, ఎన్టీఆర్ బయో పిక్ తియ్యడమేమో గాని..... ఆ సినిమా ఎలా తీస్తారేమో ఎవరిని విలన్ ని చేస్తారో అని అటు పొలిటీషియన్ ఇటు లక్ష్మి పార్వతి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దాదపు ఒక 10  రోజుల పాటు ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనే ప్రచారం చాలా డీప్ గా జరిగింది. తీరా చూస్తే బాలకృష్ణ, ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడిని ఇంకా ఫైనల్ చెయ్యలేదు అనేసరికి మారు మట్లాడకుండా సైలెంట్ అయ్యాడు ఆర్జీవీ. 

Advertisement
CJ Advs

మరి మొన్నామధ్యలో బాలకృష్ణ తన  103  వ చిత్రంగా ఎన్టీఆర్ బయో పిక్ ఉంటుందని ప్రకటించాడు. ఇక 'పైసా వసూల్' తో బాలయ్యని డైరెక్ట్ చేసిన పూరి జగన్నాధ్ ఆ అవకాశం తనకే వచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నాడు. బాలయ్య కూడా 'పైసా వసూల్' హిట్ అయితే ఆ అవకాశాన్ని పూరీకే ఇచ్చేవాడేమో? కానీ ఆ సినిమా బోల్తాకొట్టడంతో పూరి కూడా సైడ్ అయ్యాడు. అయితే గత రెండు మూడు రోజులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ బయో పిక్ బాధ్యతలు దర్శకుడు తేజకి అప్పజెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలు అలా ఇలా కాదు. బాలయ్య నుండి తేజ కి పిలుపొచ్చిందనే న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. అది నిజామా కదా అనేది క్లారిటీ లేదుగాని ఇప్పుడు మాత్రం ఆర్జీవీ చేతికి బయో పిక్ రాదనే విషయం స్పష్టంగా అర్ధమైంది.

దెబ్బకి దెయ్యం దిగిన ఆర్జీవీ ఊరికే ఎందుకు కూర్చుంటాడు. అందుకే ఇప్పుడు ఎలాగు ఎన్టీఆర్ బయో పిక్ ని బాలయ్య బుక్ చేశాడు కాబట్టి.... ఆ అవకాశం తనకి ఇచ్చేలా కనబడకపోయే సరికి ఇప్పుడు కొత్తగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే ఎన్టీఆర్ కాంట్రవర్సీ జీవితాన్ని సినిమాగాతెరకెక్కించబోతున్నట్లు ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎదుర్కున్న అవమానాలు, ఆయనపై చేసిన తిరుగుబాటు, అలాగే ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్న ఉదంతం, లక్ష్మి పార్వతి తో పెళ్లి చేసుకున్నప్పుడు అనుభవించిన తీవ్ర వ్యతిరేఖత, రాజకీయాల్లో ఎత్తుపల్లాలు... వంటి అంశాలతో తాను ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తెరకెక్కించబోతున్నట్లు ట్విట్టర్ లో కెలకడం స్టార్ట్ చేశాడు.

మరి అటు ఆర్జీవీ ట్విట్టర్ లో ఇలా లైన్ లోకొచ్చాడో లేదో వెంటనే ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మి పార్వతి, ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తీస్తే తీశాడు గాని వాస్తవాలను చూపెడితే తనకెలాంటి అభ్యన్తరం లేదని.... అసలు ఈ సినిమా విషయమై ఆర్జీవీ తననేమి సంప్రదించలేదని పాత పాటే మొదలు పెట్టింది. ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్ర అనేది ఒక్క పార్ట్ లో చూపించడానికి కుదిరే పని కాదు. అందుకే బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ తీస్తే... ఆర్జీవీ  'లక్ష్మీస్ ఎన్టీఆర్' తీస్తాడేమో. అయినా బాలయ్య మీద పంతానికి కాకపోతే రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఇలా ఎన్టీఆర్ జీవిత చరిత్ర మీద సినిమా అంటూ బయలుదేరుతాడా? ఇక ఆర్జీవీ హడావుడికి బాలయ్య స్పందనఏమిటనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. చూద్దాం ఫైనల్ గా ఈ సినిమా ముచ్చట ఎంతవరకు వస్తుందో అనేది. 

Ram Gopal Varma's Revenge on Balakrishna:

The ace director seems to be itching for revenge on Balayya and has decided to make the film in Lakshmi Parvati's Point of View which means Balakrishna and Chandrababu Naidu will become villains.&nbsp;<span>The film LAKSHMI's NTR.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs