Advertisement
Google Ads BL

బిగ్ బాస్ హౌస్ లో అన్ని చూపెట్టేశాడు..!


ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఇక గ్రాండ్ ఫినాలే కి కేవలం మరొక్క ఆరు రోజుల మాత్రమే టైం ఉంది. ఎన్టీఆర్ ఎనర్జీ పెరఫార్మెన్సు తో బిగ్ బాస్ షో... స్టార్ మా ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక ఎన్టీఆర్ కూడా ఇప్పటివరకు సినిమాల్లోనే చూపించిన హై ఓల్టేజ్ పెరఫార్మెన్సు ని ఇప్పుడు బుల్లితెర మీద కూడా చూపించి 100 కి 150  శాతం సక్సెస్ అయ్యాడు. ఇక గత రెండు రోజుల నుండి బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ చేసిన అల్లరి పెరఫార్మెన్సు, రచ్చ మాములుగా లేదు. ఎన్టీఆర్ లోని అన్ని యాంగిల్స్ ని చూపెట్టేశాడు. కేవలం నటన, పాటలు పాడడం, డాన్స్ చెయ్యడమే కాదు.... వంటలోను ఎన్టీఆర్ ది బెస్ట్ అనిపించేసుకున్నాడు.

Advertisement
CJ Advs

శనివారం రాత్రి హీరోయిన్స్ రాశి ఖన్నా, నివేద లతో చేసిన అల్లరితో పాటే గత ఆదివారం రాత్రి బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ చేసిన మటన్ బిర్యానీ, టమాటా పచ్చడి చేసిన విధానం చూస్తుంటే ఎన్టీఆర్ చెఫ్ కింద కూడా మార్కులు కొట్టేశాడు. అంతేకాదు  బిగ్ బాస్ షోకి హోస్ట్ చెయ్యడమే కాదు నేను వంటల ప్రోగ్రాం కి కూడా హోస్ట్ గా వెళితే బావుంటుంది కదా అంటూ కామెడీ చేశాడు. ఇక ఎన్టీఆర్ చేసిన మటన్ బిర్యానీ ప్రాసెస్ ఆయన చెప్పిన విధానం, చేసిన స్టైల్ కి అందరూ ఫిదా అవుతున్నారు. మరి ఎన్టీఆర్ వంట బాగా చేస్తాడని కళ్యాణ్ రామ్ చెప్పిన దానికి ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా వండేసి అదరహో అనిపించేశాడు. ఇక బిగ్ హౌస్ కంటెస్టెంట్స్ ఎన్టీఆర్ వంట చేసే విధానానికి ముచ్చటగా అలా చూస్తుండిపోయారు. 

ఇక బిర్యానీతో పాటే టమాటా పచ్చడిని కూడా ఎన్టీఆర్ ఇరగదీశాడు. అసలు బిగ్ బాస్ హౌస్ లో ఎన్టీఆర్ వంట చేస్తుంటే టీవీ ల ముందు కూర్చున్న ప్రేక్షకులకు నోట్లో నీళ్లు ఊరాయంటే అతిశయోక్తి లేదు. ఇక వంట చేసేసి చక చకా బయటికి వచ్చేసిన ఎన్టీఆర్ మళ్లీ బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టి... దీక్షని ఎలిమినేటి చేసి.. ఆమెని బయటికి తీసుకొచ్చి... ఆమెతో గేమ్ ఆడించి మరి ఇంటికి పంపాడు. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కోసం మొత్తం ఐదుగురు పోటీ పడుతున్నారు. శివ బాలాజీ, నవదీప్, ఆదర్శ్, హరితేజ, అర్చనలు ఈ టైటిల్ విన్నర్ పోటీలో ఉన్నారు. ఇకపోతే ఈ ఆదివారమే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఉంటుందని ఇక శనివారం నేను మీకు కనబడనినని.... ఆదివారం జరిగే బిగ్ బాస్ బాస్ గ్రాండ్ ఫినాలే లో మళ్లీ కలుసుకుందామని చెప్పేసి సెలవు తీసుకున్నాడు ఎన్టీఆర్.

NTR Cooks Mutton Biryani for Bigg Boss Contestants:

Young Tiger NTR turned chef! Yes you've read it right. He cooked mutton biryani for Bigg Boss contestants
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs