Advertisement
Google Ads BL

మహేష్ 'భరత్ అనే నేను' తప్పుకున్నాడు!


మహేష్ తాజా చిత్రం 'స్పైడర్' విడుదలకు సిద్ధంగా వుంది. ఈ చిత్రం ఈ నెల 27  నే థియేటర్స్ లోకి రాబోతుంది. మురుగదాస్ వంటి లెజెండ్రీ దర్శకత్వంలో పనిచేసిన మహేష్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించబోతుందో? అలాగే ఈ దసరా పండగ మహేష్ కి ఎలాంటి విజయాన్ని ప్రసాదిస్తుందో అంటూ మహేష్ అభిమానులతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు... పక్కన పొరుగు రాష్ట్రమైన తమిళనాట కూడా స్పైడర్ పై ప్రత్యేకమైన ఆసక్తి ని కనబరుస్తున్నారు. మరి మొదటిసారి మహేష్ బాబు తమిళనాట స్పైడర్ తో అడుగుపెట్టబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఇక 'స్పైడర్' చిత్రం పూర్తయిన వెంటనే మహేష్ బాబు తనకు 'శ్రీమంతుడు' విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివతో 'భరత్ అనే నేను' సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం 'స్పైడర్' పబ్లిసిటీ కార్యక్రమాలతోను 'భరత్ అనే నేను' షూటింగ్ తోనూ మహేష్ బిజీగా వున్నాడు. అయితే కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మొదట సంక్రాంతికే విడుదల చేస్తారనే టాక్ వుంది. అయితే ఇంత షార్ట్ టైం లో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని సంక్రాంతికి విడుదల చెయ్యడం అంటే కుదిరే పని కాదని చిత్ర బృందం ఈ సినిమాని వచ్చే ఏడాది అంటే 2018  మార్చ్ 30  న విడుదల డేట్ లాక్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. 'భరత్ అనే నేను' నిర్మాతలు ఈ సినిమాని 2018  మార్చ్ 30  న విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. కొద్దిరోజుల్లోనే దీనిమీద అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.

మరి సంక్రాతి సీజన్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్నా PSPK  25  చిత్రం ఉంది కాబట్టి... రిస్క్ ఎందుకులే అని మహేష్ సంక్రాతి రేస్ నుండి తప్పుకున్నట్లుగా చెబుతున్నారు. అలాగే మహేష్ మార్చ్ కి వెళిపోయాడు కాబట్టి రామ్ చరణ్ కూడా ముందు చెప్పినట్లుగానే 'రంగస్థలం 1985' చిత్రాన్ని సంక్రాతి బరిలోకి తీసుకొస్తాడేమో చూడాలి. మరి ఆ మధ్యన మహేష్ సంక్రాతి బరి నుండి తప్పుకుంటే తాను బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చరణ్ అనుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.

Bharat Ane Nenu Movie Release Date Locked?:

Mahesh's Bharat Ane Nenu movie Release Date Confirmed on 30th of March, 2018.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs