Advertisement
Google Ads BL

మాస్‌ మహారాజాతో ఆ లోటును తీరుస్తుందా..!


గత ఏడాది చందమామ కాజల్‌ అగర్వాల్‌ 'బ్రహ్మూెత్సవం, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, దో లఫ్జోంకీ కహాని' చిత్రాలతో హ్యాట్రిక్‌ డిజాస్టర్లతో సైలెంట్‌ అయిపోయింది. ఇక దాంతో అందరు ఇక చందమామ కెరీర్‌ ముగిసినట్లేనని భావించారు. కానీ ఈ ఏడాదిలో ఆమె చిరంజీవితో 'ఖైదీ నెంబర్‌ 150' , రానా దగ్గుబాటితో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలలో నటించింది. ఇక అజిత్‌ స్థాయి కాకపోయినా భారీ ఓపెనింగ్స్‌ సాధించిన 'వివేగం'లో నటించి, మెప్పించి, హ్యాట్రిక్‌ విజయాలు సాధించింది. 

Advertisement
CJ Advs

కాగా ఆమె ఇప్పుడు తన మొదటి హీరో అయిన నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సరసన 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడికి మరో పెద్ద చాన్స్‌ వచ్చినట్లు సమాచారం. 'బెంగాళ్‌ టైగర్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని వరస చిత్రాలు ఒప్పుకొంటున్న మాస్‌ మహారాజా రవితేజ తనకు హీరోగా బ్రేక్‌నిచ్చిన ముగ్గురు దర్శకుల్లో ఒకడైన శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. 'ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌' వంటి డిజాస్టర్‌ ఫ్లాప్స్‌లో ఉన్న శ్రీనువైట్లతో యంగ్‌ హీరోలు కూడా నటించడానికి ముందుకు రాని పరిస్థితుల్లో రవితేజ ఆయనపై నమ్మకం ఉంచాడు. దీనిని మైత్రీమూవీస్‌ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.ఇక ఈ చిత్రంలో చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఎంపికైనట్లు సమాచారం. 

గతంలో రవితేజ-కాజల్‌లు 'సారొచ్చారు'లో కలిసి నటించారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఆ లోటును ఈ చిత్రంతో కాజల్‌ తీరుస్తుందో వేచిచూడాలి. ఇక కాజల్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'బాద్‌షా'లో నటించి హిట్టుకొట్టింది. మరి అదే మ్యాజిక్‌ ద్వారా కాజల్‌ శ్రీనువైట్లకి హిట్టిచ్చి ఆయన కెరీర్‌ను సెంటిమెంట్‌పరంగా గాడిలో పెడుతుందో లేదో వేచిచూడాల్సి ఉంది!

Kajal Aggarwal In Ravi Teja Upcoming Movie with Sreenu vaitla!:

Seasoned star Ravi Teja set to woo pretty actress Kajal Agarwal in his upcoming big film with his friend and leading director Srinu Vaitla.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs