Advertisement
Google Ads BL

ఎల్లకాలం మెగాస్టార్‌నే అనుసరిస్తే ఎలా..?


కమెడియన్‌గా బిజీగా ఉన్న సమయంలో హాస్యనటుడు సునీల్‌ హీరోగా మారాడు. మొదట్లో 'అందాల రాముడు, మర్యాదరామన్న, పూలరంగడు' వంటి హిట్స్‌ కొట్టాడు. ఇక హీరోగా తనకు తిరుగేలేదని, సిక్స్‌ప్యాక్‌ని పెంచి యాక్షన్‌, మాస్‌ హీరో కావాలని ఆశపడ్డాడు. కానీ కమెడియన్‌గా రాణించిన ఆయన హీరోగా రెండు మూడు చిత్రాల విజయాలతోనే నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లే. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో యునైటెడ్‌ పతాకంపై చేసిన 'ఉంగరాల రాంబాబు' చిత్రం కూడా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక స్వతహాగా ఆయన తాను మెగాస్టార్‌ అభిమానినని చెప్పుకుంటాడు. హీరోగా ఎంటరైన మొదటి చిత్రాలలో కూడా ఆయన స్టెప్స్‌, మేనరిజమ్‌లు, నటనలో మెగాస్టార్‌ని అనుకరించేవాడు. కానీ అదే మెగాస్టార్‌ 'ఖైదీనెంబర్‌ 150 'లో పిలిచి అవకాశం ఇస్తానన్నా ఏవో కారణాలు చెప్పి ఆ చిత్రంలో నటించలేదు. 

హీరో అయిన నేను మరలా ఎంత మెగాస్టార్‌ అయినా మరలా కమెడియన్‌గా చేయడం ఏమిటని? దానిని వదిలేశాడు. ఇక 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో కూడా సునీల్‌ 'ఖైదీ నెంబర్‌ 150'లోని సన్నివేశాలను స్పూఫ్‌ చేశాడు. అలాగే సినిమాలో చాలా భాగం ఆయన పూర్తిగా చిరుని ఇమిటేట్‌ చేసి మెగాఫ్యాన్స్‌ సపోర్ట్‌ని, వారిని మెప్పించాలని తపన పడ్డాడు. కానీ కథలో దమ్ములేకపోవడం, సునీల్‌ నటనాపరంగా విఫలం కావడం, దర్శకుడు క్రాంతి మాధవ్‌ ఫెయిల్ అవడం దర్శకత్వం వంటి అనేక కారణాల వల్ల 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. 

మరీ చిరుపై ఎంత అభిమానమైనా అదేపనిగా అనుకరణ చేస్తే ప్రేక్షకులకు మొనాటనీ వస్తుంది. కేవలం ఇతర స్టార్స్‌, వారి చిత్రాలను పేరడీలు చేస్తూ కనుమరుగవుతున్న అల్లరి నరేష్‌ పరిస్థితిని చూసైనా సునీల్‌ జ్ఞానోదయం పొందితే మేలు....! 

Sunil In Ungarala Rambabu Movie:

Discussion About Sunil character in Ungarala Rambabu Movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs