Advertisement
Google Ads BL

రామ్‌ చరణ్‌.. ఈ కన్‌ఫ్యూజన్‌ ఏమిటి...?


సాధారణంగా డైరెక్టర్ల విషయంలో, సినిమా రిలీజ్‌ విషయంలో రామ్‌ చరణ్‌ ఎంతో ప్లానింగ్‌తో ఉంటాడు. కానీ ఆయన నిర్మాతగా మారి తమ ఓన్‌ బేనర్‌గా కొణిదెల ప్రొడక్షన్స్‌ని స్థాపించిన తర్వాత తన తండ్రి చిరంజీవితో తీసిన 'ఖైదీనెంబర్‌ 150' వల్ల చరణ్‌ 'ధృవ' చిత్రం విడుదల లేటయింది. ఇక తాజాగా ఆయన తన తండ్రితో రెండో చిత్రం 'సై..రా.. నరసింహారెడ్డి'ని 'బాహుబలి' స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఏ.ఆర్‌.రెహ్మాన్‌ వంటి టాప్‌ టెక్నీషియన్స్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, జగపతి బాబు, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌తో పాటు నయనతార వంటి ఇంకా ఎందరో ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. దాంతో తన తండ్రి చిత్రం నిర్మాణ బాధ్యతలు చూడటానికే రామ్‌ చరణ్‌ బిజీగా ఉండటంతో ఆయన ప్రస్తుతం క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో మైత్రిమూవీ మేకర్స్‌ బేనర్‌లో చేస్తున్న 'రంగస్థలం 1985' చిత్రం జాప్యం జరుగుతోందని వార్తలు వచ్చాయి. 

అసలు దసరాకే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత సంక్రాంతికి విడుదల అన్నారు. కానీ సంక్రాంతికి రేసులో పవన్‌ కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ల చిత్రం ఉంది. ఈచిత్రం విడుదల సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ అని అఫీషియల్‌గా చెప్పేశారు. దాంతో రామ్‌ చరణ్‌ చిత్రం ముందుగా డిసెంబర్‌లోనే లేదా వచ్చే ఏడాది వేసవికి మాత్రమే వస్తుందన్నారు. కానీ తాజాగా ఈ చిత్ర నిర్మాతలు మాత్రం 'రంగస్థలం 1985' మూవీ సంక్రాంతికే విడుదల అవుతుందని ప్రకటించారు. 

అలా జరిగితే బాక్సాఫీస్‌ వద్ద రెండు మూడు రోజుల గ్యాప్‌లో పవన్‌,చరణ్‌ చిత్రాలు విడుదలవ్వడం ఖాయమని చెప్పవచ్చు. గతంలో కూడా సంక్రాంతికి నందమూరి ఫ్యామిలీకి చెందిన బాబాయ్‌ బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్‌', యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు విడుదలయ్యాయి. అదే తరహాలో రాబోయే పొంగల్‌కి పవన్‌, చరణ్‌లు ఢీకొట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఈచిత్రం పీరియాడికల్‌ మూవీనే అయినా ఇదేమీ ప్రయోగాత్మక చిత్రం కాదని, పక్కా కమర్షియల్‌ చిత్రమని నిర్మాతలు చెబుతున్నారు. 

Rangasthalam 1985 Movie to Release on Time!:

Mega Power Star Ram Charan's Rangasthalam 1985 movie's release date has been planned for Sankranti, 2018. But then, Power Star Pawan Kalyan's untitled film's release date has recently been locked to Sankranthi. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs