Advertisement
Google Ads BL

ఈ సినిమాకి తెలంగాణలో థియేటర్లు ఎన్నో తెలుసా?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేస్తున్న జై లవ కుశ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక ఎన్టీఆర్ ఫాన్స్ అయితే పట్టపగ్గాలు లేకుండా పండగ చేసేసుకుంటున్నారు. దసరా పండగ ప్రారంభం రోజునే తమ అభిమాన హీరో సినిమా జై లవ కుశ థియేటర్స్ లోకి దిగిపోవడం వాళ్ళని ఒకచోట నిలవనివ్వడం లేదు. ఇప్పటికే జై లవ కుశ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమౌతోంది జై లవ కుశ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇప్పటికే వంద కోట్ల రూపాయలు దాటేసి రికార్డు సృష్టించేసింది.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు జై లవ కుశ థియేట్రికల్ ట్రైలర్ థియేటర్లలో కూడా అదే రేంజ్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ నటించిన  జై లవ కుశ కు సినిమాను వందకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారంటే ఎన్టీఆర్ సినిమా జై లవ కుశ పై ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 350  కి పైగా థియేటర్లలో జై లవ కుశను విడుదల చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో తెలంగాణలో హయ్యస్ట్ థియేటర్లలో విడుదలవుతున్న సినిమా జై లవ కుశ నే కావడం విశేషం. అలాగే జై లవ కుశ అటు ఓవర్సీస్, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా జై లవ కుశ సినిమా భారీ ఎత్తున విడుదలకా నుంది.

ఇకపోతే జై లవ కుశ కు ఈ శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో బాగా కలిసొచ్చేలా వుంది. అలాగే మరో వారం అంటే సెప్టెంబర్ 27 న స్పైడర్ చిత్రం విడుదలయ్యే వరకు జై లవ కుశకు ఎటువంటి టాక్ వచ్చిన బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్స్ కి పెద్దగా నష్టం రాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక సినిమా గనక మంచి టాక్ తో దూసుకుపోతే గనక అందరూ లాభపడతారు. లేకుంటే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకుంటారంటున్నారు.

NTR Jai Lava Kusa Movie Releasing Update:

Jr NTR triple action movie Jai Lava Kusa this movie Releasing in 350 above theaters only Telangana State.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs