Advertisement
Google Ads BL

బాలయ్య..వెంకీ టైటిల్ కొట్టేశాడు..!


బాలకృష్ణ సాధారణంగా తన చిత్రాలను మూడు నాలుగు నెలల్లో పూర్తయ్యేలా చూస్తూ, ఏడాదికి రెండు చిత్రాలైనా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటాడు. ఒక సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో చిత్రం మొదలుపెడతాడు. కానీ కేవలం తన 100వ చిత్రం సమయంలో మాత్రమే కాస్త ఆయన గ్యాప్‌ తీసుకున్నాడు. ఇక 'పైసావసూల్‌' పూర్తికాకముందే తన 102వ చిత్రంగా తమిళ సీనియర్‌ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మాతగా సినిమా ప్రారంభించాడు. వచ్చే సంక్రాంతికి పవన్‌కళ్యాణ్‌కి పోటీ పడే పనిలో పడి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తూ సంక్రాంతి హీరోగా తనకున్న పేరును మరోసారి నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం కథ కాస్త ఇంట్రస్టింగ్‌గానేఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ 40ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాని ప్రసాద్‌లా ఉంటాడట. ఆ తర్వాత నయనతార ప్రేమలో పడటం, లవ్‌ బ్రేకప్‌ కావడంతో భగ్నప్రేమికుడిగా మారడం, మరలా ఆ తర్వాత ఆయన జీవితంలోకి మరోసారి నయనతార ఎంటర్‌ అవుతుందని, ఈ ఎపిసోడ్స్‌ అన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక మన సీనియర్‌ స్టార్స్‌లో వెంకటేష్‌ కొన్ని చిత్రాలలో ఇలా 'పెళ్లికాని ప్రసాద్‌' పాత్రలు చేసి హాస్యం పుట్టించాడు. ఇక 'పెళ్లికాని ప్రసాద్‌' పేరుతో అల్లరినరేష్‌, శివాజీలు కూడా ఓ చిత్రంలో నటించారు. 

మరోవైపు ఈ చిత్రంలో ఆయన 40ఏళ్ల మద్యవయస్కుడి పాత్రతోపాటు ఆయనకు జోడీగా కొత్త భామ నటాషా దోషి నటిస్తోంది. మరో కీలక విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నయనతార పాత్ర ఓ ఫ్యాక్షన్‌ లీడర్‌ తరహాలో ఉంటుందట. తమిళంలో కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌, సౌందర్య, రమకృష్ణల కాంబినేషన్‌లో రూపొందిన రమ్యకృష్ణ 'నీలాంబరి' పాత్ర తరహాలో ఈ పాత్రను దర్శకుడు డిజైన్‌చేశాడని సమాచారం. 

Balakrishna Pellikaani Prasad role in his 102 Film:

Balakrishna and KS Ravikumar Movie's Balayya Role revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs