Advertisement
Google Ads BL

మహేష్..మొత్తం నైన్ మయం..!


'స్పైడర్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉన్నాడు. స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హుషారుగా పాల్గొన్న మహేష్ బాబు తన కొత్త కారు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి నిన్న శుక్రవారం వెళ్ళాడు. కోటీ 50 లక్షలతో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ని రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు మహేష్ ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళాడు. ఇక అక్కడ మహేష్ ఫార్మాల్టీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత అధికారులు మహేష్ బాబు కారుకి TS 09 EV 4005 నెంబరును కేటాయించారు.

Advertisement
CJ Advs

అయితే మహేష్ ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయానికి వచ్చాడని తెలియగానే అక్కడే ఉన్న వారంతా గుమ్మిగూడి మహేష్ ని చూడడానికి ఎగబడ్డారు. ఇక మహేష్ తన పని పూర్తి చేసుకుని అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇక మహేష్ కార్ నెంబర్ 4005 చూసిన వారంతా  మహేష్ లక్కీ నెంబర్ అది  అని అంటున్నారు. ఆ నెంబర్ ఎటువైపు నుండి చూసినా 9 నెంబర్ రావడమే లక్కీ అంటున్నారు. అందుకే మహేష్ లక్కీ నెంబర్ 9  అంటూ మహేష్ అభిమానులు ఫిక్స్ కూడా అయ్యారు. మహేష్ పుట్టిన తేదీ ఆగష్టు 9. ఇక మహేష్ నటించిన 'స్పైడర్' చిత్రం ఈ నెల 27 నే థియేటర్స్ లోకి రానుంది. ఈ రిలీజ్ డేట్ లో కూడా 9 నెంబర్ ఉండడం గమనించారా..! 

9 Sentiment to Super Star Mahesh Babu:

Mahesh Babu at Khairatabad RTO Office for his new Vehicle Registration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs