Advertisement
Google Ads BL

'జై లవ కుశ' రికార్డ్స్ బ్రద్దలవుతున్నాయ్..!


ఎన్టీఆర్ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తున్న 'జై లవ కుశ' మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెయ్యబోయే జై పాత్రపై  భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా 'జై లవ కుశ' చిత్రం రికార్డులు  క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం.... అలాగే సెన్సార్ బోర్డు వారు సినిమాపై పాజిటివ్ గా రిపోర్ట్ ఇవ్వడంతో సినిమా అంచనాలు లెక్కకు మించి పెరిగిపోయాయి. ఇక మొన్న సెప్టెంబర్ 10 న 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

Advertisement
CJ Advs

ఇక ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 7.54 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఫేస్ బుక్, యూట్యూబ్ ల వ్యూస్ కలిపి 7.54 మిలియన్ వ్యూస్ సాధించి నాన్ బాహుబలి రికార్డులు సృష్టించిందని 'జై లవ కుశ' నిర్మాణ సంస్థ సగర్వంగా ప్రకటించింది. మరి 'జై లవ కుశ' ట్రైలర్ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయానికి అందరూ ఫిదా అయ్యారు. సెలబ్రిటీస్ దగ్గర నుండి సాధారణ ప్రేక్షకుడు వరకు 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ కి నీరాజనాలు పట్టారు. ఇక ఇప్పుడు పెద్ద స్టార్స్ ట్రైలర్స్ విడుదలైన 10 రోజుల తర్వాతే కోటి వ్యూస్ సాధిస్తున్న టైం లో ఎన్టీఆర్ 'జై లవ కుశ' ట్రైలర్ విడుదలైన కొద్ది రోజులలోనే కోటి వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఫేస్ బుక్, యూట్యూబ్ వ్యూస్ కలిపి జై లవ కుశ కోటి వ్యూస్ సాధించినట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. జై లవ కుశ మీదున్న క్రేజ్ ఎలాంటిదో ఈ వ్యూస్ చూస్తుంటే మాత్రం పూర్తిగా అర్ధమవుతుంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం, హీరోయిన్స్ అందాలు, సెన్సార్ ఇచ్చిన పాజిటివ్ రిపోర్ట్ తో జై లవ కుశకు విపరీతమైన బజ్ ఏర్పడింది. మరి ఈ చిత్రం వచ్చే గురువారం అంటే సెప్టెంబర్ 21 నే విడుదల కాబోతుంది.

Jai Lava Kusa Trailer Record:

Jai Lava Kusa Creates Non Baahubali Records
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs