Advertisement
Google Ads BL

బిగ్ బాస్ విన్నర్ ని అనౌన్స్ చేసే దెవరు..?


ఒకప్పుడు బాలీవుడ్ లో బుల్లితెర మీద రియాలిటీ షోలకు బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇప్పటికి అక్కడ సల్మాన్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో టాప్ 1 లోనే వుంది. అదే షోని ఇప్పుడు తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్ హోస్టింగ్ గా నిర్వహిస్తుంది స్టార్ మా యాజమాన్యం. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తెరకెక్కుతుంటే తెలుగులో టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తుంది. ఎన్టీఆర్ హోస్ట్ అంటే ఈ షో మీద విపరీతమై ఆసక్తి అందరిలో కలగడమే కాదు... టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా దూసుకుపోవడమే కాదు... నెంబర్ 1 గా కూడా అవతరించింది. ఇక మధ్యలో ఆ టీఆర్పీ రేటింగ్స్ అటు ఇటు అయినా లాస్ట్ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ షో మీద మళ్ళీ క్రేజ్ పెరిగేలా చేశారు. అసలు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 2 రోజులు బిగ్ బాస్ షో మీద ఎనలేని క్రేజ్ ఉంటుంది.  ఎన్టీఆర్ చేసే పెరఫార్మెన్సు, అల్లరి, ఎనర్జీతో బిగ్ బాస్ షోని రక్తి కట్టించాడు. అలాగే బిగ్ బాస్ షో కి వచ్చి టాలీవుడ్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ చేసుకోవడం కూడా బిగ్ బాస్ షోకి గల క్రేజ్ ని తెలియజేస్తుంది. 

Advertisement
CJ Advs

విజయ్ దేవరకొండ, రానా, తాప్సి, అల్లరి నరేష్, సునీల్ వంటి తారలు తమ సినిమాల ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చారు. ఇకపోతే ఇప్పుడు బిగ్ బాస్ షో మొదలయ్యి 60  రోజులు కావొస్తుంది. ఇంకో 10  రోజుల్లో ఈ షో పూర్తి కానుంది. ఈ షోలో ఇప్పుడు ఉన్న 6  గురు పార్టిసిపేట్స్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50  లక్షల కోసం పోటీపడుతున్నారు. ఇక బిగ్ బాస్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు... శివ బాలాజీ బిగ్ బాస్ విన్నర్ అవుతాడా? లేకుంటే నవదీపా.. లేకుంటే హరితేజనా ... అలాగే అర్చన, ఆదర్శ్, దీక్షలలో ఎవరు బిగ్ బాస్ ప్రైజ్ మనీ తన్నుకుపోతారో అని ఎదురు చూస్తున్నారు.

అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరు బయటికి వెళ్ళిపోతారు? అంతేకాకుండా బిగ్ బాస్ షో ఎండింగ్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా ప్లాన్ చేస్తున్నారో? అంటూ ఒకటే క్యూరియాసిటీతో ఉన్నారు. ఇక బయట వినబడుతున్న టాక్ బట్టి ఈ నెల  24న జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ లో విన్నర్ ని అనౌన్స్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయబోతున్నారట బిగ్ బాస్ షో నిర్వహాకులు. అయితే స్పెషల్ గెస్ట్ గా స్పైడర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న మహేష్ బాబుని షో నిర్వాహకులు సంప్రదించగా మహేష్ ఆ రిక్వెస్ట్ ని సున్నితంగా తిరస్కరించాడట. 

మరి బాక్సాఫీసు వద్ద బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ జై లవ కుశతో.... మహేష్ బాబు స్పైడర్ తో పోటీపడుతున్నారు. అది మనసులో ఉంచుకుని మహేష్ రానన్నాడో ఏమోగానీ.... మరోపక్క జై లవ కుశతో స్పైడర్ కూడా పోటీపడుతోంది కదా మరి అలాంటప్పుడు మహేష్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ లో కూర్చోబెడితే ఏం బావుంటుందని.. అందుకే ఎవరైనా వేరే సీనియర్ స్టార్ ని చూడమన్నట్లుగా ఎన్టీఆర్ కూడా షో నిర్వాహకులకు చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి చూద్దాం ఈ నెల 24 న బిగ్ బాస్ షో స్టేజ్ మీదకి ఇద్దరు స్టార్స్ ఎలా సందడి చెయ్యబోతున్నారో.... అందులో ఒకరి అంటే ఎన్టీఆర్ అల్లరి తెలుసు, మరి మరొకరు ఎవరు అంటూ అందరిలో పిచ్చ ఆసక్తి ఏర్పడింది.

Who Will Be The Chief Guest For Bigg Boss Finale?:

With Junior NTR on one side and a big star on the other, the final episode of Bigg Boss is certainly going to be interesting. The biggest catch is, who is going to win the reality show and who is going to be the chief guest.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs