Advertisement
Google Ads BL

మెగా దర్శకుడి బిస్కెట్లు ఫలిస్తాయా..?


ఎవరు ఎన్నిచెప్పినా, దర్శకుడు హరీష్‌శంకర్‌, నిర్మాత దిల్‌రాజు, హీరో బన్నీలు నెగటివ్‌ రివ్యూలు రాసిన మీడియాను, నెగటివ్‌ పోస్ట్‌లు పెట్టిన వారిపై ఎదురుదాడికి దిగి ఏవేవో కలెక్షన్లు చూపించినా కూడా 'డిజె' చిత్రంలో కంటెంట్‌ లేదని, ఒక రొటీన్‌ చిత్రమని ఏ సామాన్య ప్రేక్షకుడిని అడిగినా చెబుతారు. ఇక ఒక విధంగా తెలుగు రాష్ట్రాలలో టాక్‌కి భిన్నంగా బాగానే వసూలు చేసినప్పటికీ ఓవర్‌సీస్‌లో మాత్రం 'దువ్వాడ జగన్నాథమ్‌' పల్టీ కొట్టాడు. ఇప్పటికీ విశ్లేషకులు ఈ ఏడాది దిల్‌రాజుకి బాగా కలిసొచ్చిందని, 'శతమానం భవతి, నేను లోకల్‌, ఫిదా' చిత్రాలు రూపాయికి నాలుగైదు రూపాయల లాభం తెచ్చాయని చెబుతున్నారే గానీ డిజెపై మాత్రం స్పందించకుండా తమ మాట మీదనే నిలబడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక 'గబ్బర్‌సింగ్‌' తర్వాత సరైన హిట్‌ లేని హరీష్‌శంకర్‌ తాజాగా బాలకృష్ణని కలిసి ఓ స్టోరీ వినిపించి వచ్చాడని సమాచారం. పూరీ, కె.యస్‌.రవికుమార్‌ వంటి ఫ్లాప్‌ దర్శకులకు ట్రాక్‌ రికార్డును పట్టించుకోకుండా బాలయ్య అవకాశాలిస్తూ ఉండటంతో మెగా హీరోలతో ఎక్కువ చిత్రాలు చేసి, ఎక్కువగా మెగా భజన చేసే హరీష్‌శంకర్‌ బాలయ్యని కలిసి కథ చెప్పడం ఆశ్చర్యమే. కాగా 'డిజె' తర్వాత హరీష్‌శంకర్‌ ఓ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా తీస్తున్నాడని, అందుకోసం ఆయన అమెరికా వెళ్లి లోకేషన్లు కూడా చూసి వచ్చినట్లు ఆయన అమెరికాలోని తన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

ఇక ఈ మెగా దర్శకుడు బాలయ్యకు కథ చెప్పడమే కాదు... మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రంపై కూడా పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పటివరకు మహేష్‌ స్టిల్స్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ స్టిల్స్‌....ఏం యాటిట్యూడ్‌? విడుదల వరకు వెయిట్‌ చేయలేను... అంటూ మెట్లపై కూర్చుని ఉన్న ఫొటోని పోస్ట్‌ చేశాడు. అటు బాలయ్యని, ఇటు మహేష్‌కి బిస్కెట్‌ వేస్తున్నది ఎందుకో హరీష్‌శంకర్‌కే తెలియాలి? అయినా ఒకే ఫ్యామిలీ హీరోలనే నమ్ముకుంటూ సినిమా సినిమాకి ఎంత గ్యాప్‌ వస్తుందో అర్ధమయ్యే సరికే హరీష్‌శంకర్‌ ఇలా ఇప్పుడు అందరినీ మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పవచ్చు...!

Harish Shankar Praises Mahesh Babu Spyder Look:

Harish Shankar Tweet on Spyder Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs