Advertisement
Google Ads BL

బన్నీ ఫ్యాన్స్ కి ముందుంది...!


అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ని కథా రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది. 'డీజే' తర్వాత బన్నీ చేస్తున్న ఈ చిత్రం మొదలై ఒక నెల పైన అవుతుంది. అయితే ఆగష్టు 15 న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలవుతుందని ప్రచారం జరిగినా కేవలం దర్శకుడు, నిర్మాతలతో కూడిన వర్కింగ్ ఫొటోస్ ని మాత్రమే వదిలి అల్లు అర్జున్ అభిమానులను డిజప్పాయింట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ దసరాకి అల్లు అర్జున్ తన కొత్త సినిమా హడావిడి మొదలెట్టబోతున్నాడట. 

Advertisement
CJ Advs

ఆ దసరాకి 'నా పేరు సూర్య' ఫస్టు లుక్ విడుదల చేస్తారని అంటున్నారు. ఇక 'నా పేరు సూర్య' షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. అయితే ఈ షూట్ తర్వాత ప్రారంభం కాబోయే షెడ్యూల్ వివరాల్ని యూనిట్ వెల్లడించింది. ఈనెల 24 నుంచి నా పేరు సూర్య కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఊటీలో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతుంది. మరి ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయ్యాడు బన్నీ. ఫారిన్ ఫిట్ నెస్ ట్రయిలర్ ఆధ్వర్యంలో కొత్త లుక్ కోసం చాలానే కష్టపడ్డాడు. 

రామలక్ష్మి సినీక్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను నాగబాబు సమర్పిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో అర్జున్, శరత్ కుమార్ లు కూడా కీలక పాత్రలు చెయ్యబోతున్నట్లు చెబుతున్నారు.

Good News to Allu Arjun Fans:

Allu Arjun's Naa Peru Surya Naa illu India First Look on Vijaya Dasami
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs