Advertisement
Google Ads BL

'జనతా గ్యారేజ్' లో, 'జై' పక్కన కూడా..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో... మోహన్ లాల్ కుటుంబానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ... చివరికి ఎన్టీఆర్ కి పిల్లనిచ్చిన మామగా సాయికుమార్ చేసిన యాక్టింగ్ సూపర్. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ'లో సాయి కుమార్ పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అందరి మదిలోను తలెత్తుతుంది. ఎందుకంటే ఈ 'జై లవ కుశ'లోను సాయి కుమార్ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరుస్తున్నాడు. మూడు పాత్రలు అంటే సినిమా మొత్తం ఎన్టీఆరే కనబడతాడు. 

Advertisement
CJ Advs

మరి హీరోయిన్స్ కి, విలన్స్ కి 'జై లవ కుశ'లో ఎంత చోటుందో తెలియదు గాని... 'జై లవ కుశ' ట్రైలర్ లో మాత్రం హీరోయిన్స్, విలన్స్ ఇలా వచ్చి అలా మాయమవుతారు. ఇక సాయి కుమార్ కూడా ట్రైలర్ లో అలాంటి ఒక సన్నివేశంలోనే కనబడుతున్నాడు. అయితే సాయి కుమార్ వంటి పెద్ద నటుడు 'జై లవ కుశ'లో... హీరోయిన్స్ కంటే ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడని సమాచారం. ఎన్టీఆర్ జై పాత్రకు కుడి భుజంగా సాయికుమార్ పాత్ర ఉంటుందని టాక్. మరి ట్రైలర్స్ లో, పోస్టర్స్ లో చూపించిన దాన్ని బట్టి జై వెనుకగా చేతులు కట్టుకుని కనిపిస్తున్నాడు సాయి కుమార్.

మరి 'జై లవ కుశ'లో సాయి కుమార్ పాత్ర ఎలా వుండబోతుందో మాత్రం మరో వారం రోజుల్లో తెలిసి పోతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 21 నే విడుదల కానుంది.

Sai Kumar Important Role in Jai Lava Kusa:

Sai Kumar Back to Back Roles in Jr NTR Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs