Advertisement
Google Ads BL

అందరిలాంటి వాడు కాడు.. ఈ హీరో!


కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో విశాల్ కి చేతిలో సరైన హిట్ లేకపోయినప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అతనికి మంచి పేరుంది. ఇక తాజాగా విశాల్ తీసుకునే నిర్ణయాల గురించి తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నడిగర్ సంగం ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే కాదు... నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన తర్వాత వెంటనే పైరసీ వెబ్ సైట్ల పని పడతానంటూ హడావిడి చేశాడు. కేవలం అది హడావిడి మాత్రమే కాదు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని..... చేతలలో చూపించాడు. తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీం సహాయంతో సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్ లో పెట్టేసి నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఒక ప్రముఖ వెబ్సైట్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించడమే కాదు.... ఆ వెబ్ సైట్ ని మూయించిపడేశాడు.

Advertisement
CJ Advs

ఈ దెబ్బకి మిగతా పైరసీ వెబ్సైట్ ఓనర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇక అంతటి ఘనకార్యం చేసిన విశాల్ కి పొగడ్తల మీద పొగడ్తలు దక్కుతున్నాయి. అలాగే నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన తర్వాత తమిళ రైతులని ఆదుకుంటామని విశాల్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిర్ణయాలను తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే  ప్రతి సినిమా టికెట్ ద్వారా వచ్చే ఆదాయంలోంచి ఒక రూపాయి రైతు సంక్షేమ నిధికి వెళ్లేలా విశాల్ తీసుకున్న నిర్ణయం తో విశాల్ పేరు తమిళనాట మార్మోగిపోతోంది. ఇక ఇప్పుడు తాజాగా తాను నటించిన 'తుప్పారివాలన్’ చిత్రం ఈ గురువారమే విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రానికి వచ్చే లాభాల్లో కొంత మొత్తం రైతులకి ఇస్తానని కూడా విశాల్ ప్రకటించాడు. 

Hero Vishal Sensational Decisions in Kollywood:

Vishal- Sensational Kollywood Hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs