ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' ముచ్చట్లే వినబడుతున్నాయి. ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా పై విపరీతమైన అంచనాలున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం చెయ్యడం, ఒకపాత్రలో విలన్ గా కనిపించనుండడంతో.... కేవలం అంచనాలు మాత్రమే కాదు... అందరిలో బోలెడంత ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకులను అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు పాటలతో వేడెక్కిస్తున్నాడు. రోజుకో సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో 'జై లవ కుశ' మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
అయితే ఇప్పుడు 'జై లవ కుశ' స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక స్టోరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ప్రచారంలో ఉన్న 'జై లవ కుశ' స్టోరీ ఏమిటంటే- జై, లవ, కుశ లు ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు. అనుకోని కారణాలతో ముగ్గురు చిన్నప్పుడే విడిపోతారు. ఇక పెద్దయిన ముగ్గురిలో లవ కుమార్ బ్యాంక్ మేనేజర్ గా, భయస్తుడిగా ఉంటాడు. కానీ కుశ మాత్రం ఎంతో జ్యోవిఎల్ గా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలనే ప్లాన్ తో దొరికిన చోట దొరికినంత దోచుకుంటుంటాడు. ఇక లవ, కుశ లిద్దరూ కలిసే ఉంటారు. అయితే లవ కుమార్ కి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పొతే... లవ లాగా బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలోకి కుశ ఎంటర్ అయ్యి అక్కడ అందరిని కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జై కేరెక్టర్ మాత్రం రావణ్ గా, విలన్ గా లవకి కుశ కి ఇద్దరికీ దూరంగా ఉంటాడు. ఇక జై మాత్రం లవ, కుశ ల మీద పగా ప్రతీకారాలతో రగులుతూ పొలిటికల్ గా ఎదుగుతాడట. అయితే 'జై లవ కుశ'లోని రెండు అదిరిపోయే ట్విస్టులతో వీరు ముగ్గురు ఒక్కటవుతారట.
అలాగే ఎవ్వరూ ఎక్సపెక్ట్ చెయ్యని ట్విస్ట్ కూడా 'జై లవ కుశ'లో ఉంటుందని చిత్ర బృందం చెబుతున్న మాట. అయితే ఆ ట్విస్ట్ ఏమిటి అనేది ఎవ్వరి ఊహలకు అందకుండా చిత్రీకరించారట ఎన్టీఆర్ అండ్ బ్యాచ్. మరి ఇద్దరు భామలతో జోడి కడుతున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ' స్టోరీ లైన్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా ప్రచారంలో ఉంది.