కమెడియన్‌గా.. మరీ ముఖ్యంగా హీరోలకు స్నేహితునిగా తనదైన సపరేట్ బాడీలాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ కలిగిన హాస్యనటునిగా సునీల్‌కి తెలుగులో ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదికి 15 నుంచి 20 చిత్రాల వరకు చేస్తూ యమా బిజీగా ఉంటూ రోజువారీ కాల్షీట్స్ కింద లక్షల్లో డిమాండ్ ఉన్న పీక్ స్టేజీలో ఆయన 'అందాలరాముడు' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇక 'అందాలరాముడుతో పాటు మర్యాదరామన్న, పూలరంగడు' వంటి చిత్రాలలో హీరోగా చేసి మెప్పించాడు. ఈ చిత్రాలన్ని ఆయన కోసమే తయారైన సబ్జెక్ట్స్‌గా, కామెడీని పంచే హీరో పాత్రలతో రూపొందాయి. దాంతో ఇవి విజయాలను నమోదు చేశాయి. ఇక నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన 'తడాఖా' చిత్రం రీమేక్. అందులో నాగచైతన్య సోదరుడిగా ఆయన కాస్త యాక్షన్ కూడా పండించాడు. ఇలా తనకు రెడీమేడ్ గా సూట్ అయ్యే కామెడీ హీరో పాత్రలను చేయడంతో ఆయనకు విజయాలు వచ్చాయి. కానీ అక్కడే ఆయన గాడి తప్పాడు.
ఓ చిత్రంలో సునీల్ నటిస్తుంటే అందులో ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని ప్రేక్షకులు ఊహిస్తారని అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం యాక్షన్, మాస్ చిత్రాలను చేస్తూ, సిక్స్‌ప్యాక్ పెంచి రొటీన్ యాక్షన్ బాపత్తు చిత్రాలు చేశాడు. దాంతో ఆయనకు వరుసగా ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. 'పూలరంగడు' తర్వాత ఆయనకు కనీసం యావరేజ్ చిత్రం కూడా లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తానేదో పెద్ద మాస్ హీరోగా మారిపోయాననే భ్రమల ఉండటమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఎందరో నటీనటులు ప్రతిష్టాత్మకమైన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'చిత్రంలో ఒక్క క్షణమైనా స్క్రీన్‌పై కనిపించాలని ఆశపడ్డారు. అలాంటి చిత్రంలో ఆయనకు మంచి స్నేహితుడి పాత్ర వచ్చినా చేయలేదు. ఇక త్రివిక్రమ్‌శ్రీనివాస్-పవన్‌కళ్యాణ్‌లకాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా సునీల్ కోసం ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ మంచి క్యారెక్టర్‌ని డిజైన్ చేసినా నో అని చెప్పాడు. ఇక ఆయన ప్రస్తుతం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'ఉంగరాల రాంబాబు' చిత్రం చేశాడు. కానీ సునీల్ మార్కెట్ పరిస్థితి దృష్ట్యా ఈ చిత్రం కొనడానికి బయ్యర్లు ముందుకు రాని పరిస్థితి. దీంతో సునీల్‌కి అసలు పరిస్థితి అర్ధమైంది.
తాజాగా ఆయన తాను మరలా కమెడియన్ పాత్రలు కూడా చేస్తానని చెప్పాడు. అయితే హీరో పాత్రలను వదలనని, ఏడాదికి తనకు సూటయ్యే రెండు చిత్రాలను హీరోగా చేస్తూనే కమెడియన్‌గా మరలా బిజీ అవుతానని చెప్పాడు. ఇంతకాలానికి సునీల్ మరలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇక సునీల్ గ్యాప్ ఇవ్వడం, బ్రహ్మానందం, అలీ వంటి వారు ఫేడవుట్ అవుతున్న దశలో పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, ధన్‌రాజ్, 30 ఇయర్స్ పృధ్వీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్ వంటి వారు బిజీ అయ్యారు. మరి సునీల్ రాకతో వీరికి కాస్త డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తుంటే, తక్కువ రెమ్యూనరేషన్‌కి పనిచేస్తున్న ఈ కమెడియన్స్ వల్ల సునీల్‌కి అవకాశాలు కాస్తైనా తగ్గుతాయని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా మరలా నాటి సునీల్ స్థాయి ఆయన మరలా చేరుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది...!