Advertisement
Google Ads BL

అర్జున్ రెడ్డి హీరోయిన్ కి నెల్లూరులో ఏమైంది?


అర్జున్ రెడ్డి సినిమా విజయంతో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించిన వారిలో హీరోయిన్ షాలిని పాండే ఒకరు. డైరెక్టర్ సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ లకు ఎంత పేరు వచ్చిందో హీరోయిన్ షాలిని పాండే నటనకు కూడా ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. వీరికి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా పిచ్చ క్రేజ్ వచ్చేసింది. ఒక్క సినిమా విజయంతో షాలిని పాండే కి వరుసగా ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అంతే కాకుండా షాలిని పాండే ని షాప్ ఓపెనింగ్స్ కి బాగానే ఇన్వైట్ చేస్తున్నారు. అందులో భాగంగానే షాలిని ఈ రోజు బుధవారం నెల్లూరులో సెల్‌ పాయింట్‌ను ప్రారంభించడానికి వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు షాలిని చిన్న వీడియో బైట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను నెల్లూరులో సెల్‌ పాయింట్‌ను ప్రారంభించడానికి వెళుతున్నట్లు ఏంటో సంతోషంగా ఆ వీడియోలో చెప్పింది.

Advertisement
CJ Advs

తీరా సెల్‌ పాయింట్‌ను ప్రారంభించే టైం కి అనుకోని సంఘటన చోటు చేసుకుని మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది షాలిని. విషయంలోకి వస్తే..  సెల్‌ పాయింట్‌ను ప్రారంభోత్సవం జరిగేటప్పుడు షాలిని కళ్ళు తిరిగి కిందపడిపోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో షాలిని సొమ్మసిల్లిపడిపోయి తీవ్ర అస్వస్థత కు గురైందని తెలుస్తుంది. ఇక వెంటనే షాలిని పాండేని  దగ్గరలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ట్రీట్‌మెంట్ తర్వాత ఆమెని స్ట్రైచర్‌పై తీసుకెళ్లి కారులో ఎక్కించి పంపించారు ఆసుపత్రి సిబ్బంది. 

అయితే ఆమెను స్ట్రైచర్‌పై ఉంచి కారు ఎక్కించేటప్పుడు షాలిని మొహం కనబడకుండా తెల్లని క్లాత్ కప్పి ఉంచారు.  మరి హీరోయిన్ షాలిని ఆసుపత్రిలో చేరింది అనగానే అక్కడ ఉన్న పేషేంట్స్, ఆసుపత్రి సిబ్బంది కూడా షాలిని తో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడబట్టే, వారి కన్ను గప్పడానికి ఆసుపత్రి సిబ్బంది అలా షాలిని మొహం పై క్లాత్ కప్పి ఉంచినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లెమ్ లేనట్లుగా డాక్టర్స్ తెలుపుతున్నారు. 

Arjun Reddy Heroine Shalini Pandey Joins in Hospital:

Arjun Reddy Heroine Shalini Pandey Suffers from ill Health at Nellore
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs