యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' - మహేష్ బాబు 'స్పైడర్' చిత్రాలు రెండూ దసరా బరిలో పోటీకి సిద్ధమైయ్యాయి. ఇద్దరు హీరోలు కూడా ఎవరు పై చెయ్యి సాధిస్తారో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'జై లవ కుశ'లో ఎన్టీఆర్ మూడు పాత్రలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక మహేష్ కూడా ఎంతో సైలిష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా 'స్పైడర్' తో ప్రేక్షకుల మన్ననలు పొందడానికి రెడీ అవుతున్నాడు.
ఇకపోతే ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' వంటి హిట్ తర్వాత 'జై లవ కుశ' చేశాడు. ఈ చిత్రంతో కూడా హిట్ కొట్టేసి టాప్ ప్లేస్ కి వెళ్లాలని చూస్తున్నాడు. మరోవైపు 'బ్రహ్మోత్సవం' వంటి భారీ డిజాస్టర్ తర్వాత చేస్తున్న 'స్పైడర్' తో మహేష్ ఎంతో కసితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా గతంలో కూడా మూడు నాలుగు సార్లు పోటీ పడ్డారు. ఒక్కోసారి ఒక్కక్కొరు పై చెయ్యి సాధించారు. 2003 లో ఎన్టీఆర్ 'నాగ' సినిమాతో మహేష్ బాబు 'ఒక్కడు' తో పోటీపడగా, ఆ పోటీలో 'ఒక్కడు'తో మహేష్ సూపర్ హిట్ కొట్టి ఎన్టీఆర్ మీద పై చెయ్యి సాధించాడు.
అలాగే 2010 లో ఎన్టీఆర్ 'బృందావనం', మహేష్ 'ఖలేజా' చిత్రాలు పోటీ పడ్డాయి. ఇక ఎన్టీఆర్ 'బృందావనం'తో హిట్ అందుకోగా 'ఖలేజా'తో మహేష్ యావరేజ్ గా కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఇకపోతే 2011 లో మహేష్, ఎన్టీఆర్ లు మరొక్కసారి బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'తో మహేష్ 'దూకుడు'తో పోటీపడగా మహేష్ 'దూకుడు' హిట్టును... ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' తో ప్లాప్ అందుకున్నారు. మరి ఇద్దరూ కలిసి విజయం సాధించిన సందర్భాలు మాత్రం లేదు. మరి ఇప్పుడు ఈ 2017 లో కూడా 'జై లవ కుశ, స్పైడర్' లలో ఏది పై చెయ్యి సాధిస్తుందో ఈ దసరాకి తేలిపోనుంది.