మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ స్టార్ గా వున్నాడు. తెలుగులో మహేష్ బాబు సినిమాలు ప్లాప్ అయినప్పటికీ... ఆ తర్వాత మహేష్ సినిమా వస్తుంది అంటే ఆ క్రేజే వేరు. మహేష్ సినిమా కోసం మహేష్ అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తారు. ఇప్పుడు మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' సినిమా విడుదల కోసం మహేష్ అభిమానులే కాదు... రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అందులోను మురుగదాస్ వంటి డైరెక్టర్ తో మహేష్ సినిమా అంటేనే అందరిలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండనే ఉంటుంది. ఇక మురుగదాస్ 'స్పైడర్' చిత్రాన్ని తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కించాడు.
ఇక మహేష్ అటు తమిళంలో ఇప్పుడు డెబ్యూ హీరోనే. ఎందుకంటే మహేష్ సినిమాలు ఇప్పటివరకు కేవలం అక్కడ కోలీవుడ్ లో డబ్ మాత్రమే అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం 'స్పైడర్' తో మహేష్ నేరుగా తమిళంలోకి అడుగుపెట్టేస్తున్నాడు. మరి అక్కడ తమిళులకు మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా వుండబోతుందో అంటున్నారు కొందరు. మహేష్ బాబు ఇక్కడ తెలుగులో టాప్ హీరోనే కానీ... అక్కడ మాత్రం ఇప్పుడే తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో కాబట్టి.... తమిళులు మహేష్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో... అనే ఉత్కంఠ అందరిలో ఉంది. అందులోను మురుగదాస్ ఈ సినిమాని తెలుగుకే ఇంపార్టెన్స్ ఇస్తూ తెరకెక్కించినప్పటికీ తమిళానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది.
ఎందుకంటే తెలుగులో ఒక సన్నివేశం చిత్రీకరించినప్పటికీ అదే సన్నివేశాన్ని తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఎంతో జాగ్రత్తగా మురుగదాస్ తెరకెక్కించాడు. ఇక మురుగదాస్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు హీరోయిజం అంటేనే ఎక్కువ ఇష్టపడతారని... మహేష్ ని మహేష్ లాగే చూడాలనుకుంటారని చెబుతున్నారు. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం 'ప్రిన్స్ ఈజ్ నథింగ్ బట్ జీరో...' అందుకే మురుగదాస్ తమిళులకు తగ్గట్టుగానే తమిళ్ వెర్షన్లో మార్పులు చెయ్యాల్సి వచ్చిందట. అలాగే ఒక్క మాటలో చెప్పాలంటే.. తమిళ్ 'స్పైడర్'లో హీరో మహేష్ కాదు.. అక్కడ హీరో కథ అంటూ మహేష్ తమిళంలో ఏంటో చెప్పేశాడు.
అందుకే 'స్పైడర్' సినిమాని మురుగదాస్ ఎక్కువగా తమిళంలోనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నట్టు కనబడుతున్నాడు. ఇప్పటికే 'స్పైడర్' ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించిన 'స్పైడర్' చిత్ర బృందం అక్కడ కోలీవుడ్ నుండే ఎక్కువ నటీనటులను తీసుకుంది. విలన్ సూర్య దగ్గర నుండి మరో విలన్ భరత్ ని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జై రాజ్ ని ఇలా చాలామంది తమిళులకు మురుగదాస్ ప్రిఫరెన్స్ ఇచ్చాడనే టాక్ ఉండనే వుంది. మరి తెలుగులోనే 'స్పైడర్' కి పిచ్చ బిజినెస్ జరిగింది. కానీ తమిళంలో చాలా తక్కువ బిజినెస్ జరిగింది. మరి ఇక్కడ ఎక్కువ పబ్లిసిటీ అవసరమా? లేకుంటే అక్కడ తమిళంలో ఎక్కువ పబ్లిసిటీ అవసరమా? అనేది మురుగదాస్ కే తెలియాలి.