Advertisement
Google Ads BL

ఎవరన్నారు ఆమె మహానటి అని..!?


కొన్నిసార్లు ఓ చిత్రం విషయంలో దర్శకనిర్మాతలు ఏమీ అప్‌డేట్స్‌ని ఇవ్వనప్పుడు ఆటోమేటిగ్గా మీడియాతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆ చిత్రం గురించి వేల కళ్లతో వెయిట్‌ చేస్తుంటారు. మూసిన గుప్పిట్లో ఏముందనే ఉత్సుకత మొదలవుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఒక్క పిక్‌ విడుదలైనా సరే.. దానిని ఆ చిత్రానికి సంబంధించిన పిక్‌గా, గెటప్‌గా భావించడంతో అవి వైరల్‌ అవుతుంటాయి. అయితే వెంటనే దానిపై క్లారిటీ ఇస్తే అందరికీ ఆ విషయం బోధపడుతుంది. ఇదే పనిని కీర్తిసురేష్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆమె రెండు చిత్రాలలో నటిస్తోంది. ఒకటి పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల చిత్రం కాగా, మరోటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'మహానటి' చిత్రం. తాజాగా ఆమె పిక్‌ ఒకటి బయటకు వచ్చింది. ఇక అది పవన్‌-త్రివిక్రమ్‌ చిత్రంలోని పిక్‌ అని ఎవ్వరూ అనుకోలేదు. అందులో ఉన్న గెటప్‌ని చూస్తేనే ఆ విషయం అర్ధమవుతోంది. దాంతో అందరు కలిసి అది 'మహానటి' చిత్రంలోని సావిత్రి పాత్రను పోషిస్తున్న కీర్తిసురేష్‌ గెటప్‌గా ప్రచారం చేశారు. దాంతో ఈ పిక్‌ వైరల్‌ అయింది. కానీ దీనిని వెంటనే కీర్తి సురేష్‌ ఖండించింది. 

ఆలస్యం చేయకుండానే ఆమె.. ఆ ఫొటో 'మహానటి' చిత్రంలోనిది కాదని, ఓ షాపింగ్‌ మాల్‌కి ప్రారంభోత్సవం కోసం దిగిన ఫొటోగా ఆమె కన్‌ఫర్మ్‌ చేసింది. 'మహానటి'కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ రావడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ఆమె తెలిపింది. కాగా తాజాగా విడుదలైన పిక్‌ 'మహానటి'కి సంబంధించినది కాకపోయినా అంతకు ముందు అనఫిషియల్‌గా విడుదలైన లుక్‌, దుల్కర్‌ సల్మాన్‌కి సంబంధించిన చిత్రం యూనిట్‌ విడుదల చేసిన అఫీషియల్‌ పిక్స్‌ మాత్రం 'మహానటి' చిత్రంలోనివేనని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో సమంత, విజయ్‌దేవరకొండలు కూడా కీలకపాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Keerthi Suresh Gave Clarity About Mahanati Savitri Look:

Keerthi Suresh Tweeted on Mahanati Look rumors 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs