Advertisement
Google Ads BL

నితిన్ తర్వాత నాగ చైతన్యేనా..!!


'లై' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ కి ఆ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది. నితిన్ కి జోడిగా ఆడిపాడిన మేఘ ఆకాష్ ప్రస్తుతం నితిన్ తోనే మరో చిత్రంలో నటిస్తుంది. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నితిన్ మరోమారు మేఘ ఆకాష్ నే సెట్ చేసుకున్నాడు. 'లై' సినిమాలో మేఘ ఆకాష్ స్క్రీన్ మీద బాగానే కనబడింది. నటన పరంగా కూడా ఒకే... అందుకే నితిన్, మేఘ కి మరో అవకాశం ఇచ్చాడు. స్వతహాగా మేఘ ఆకాష్ మలయాళీ భామ. ఇకపోతే నితిన్ వెంటనే తన మరో సినిమాలో అవకాశం ఇచ్చాడు అనగానే...'లై' సినిమా టైం లో మేఘ మీద పెంచుకున్న ఇష్టమే కారణమని ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Advertisement
CJ Advs

అదలా ఉంటె మేఘ ఆకాష్ ని రామ్ కూడా తన సినిమా 'ఉన్నది ఒకటే జిందగీ' లో కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ మేఘ ఆకాష్ మాత్రం ఆ సినిమాకి సైన్ చేసి మరీ కాల్షీట్స్ ప్రాబ్లెమ్ చెప్తూ రామ్ ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చేసింది. అయితే ఇప్పుడు మేఘ ఆకాష్ కి మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చేటట్లు ఉందంటున్నారు. నాగ చైతన్య - మారుతీ కలయికలో తెరకెక్కబోయే చిత్రానికి గాను ముగ్గురు హీరోయిన్స్ పేర్లు వినబడుతున్నాయి. అందులో ఒకరు పూజా హెగ్డే కాగా మరొకరు అను ఇమ్మాన్యుయేల్ అలాగే మూడో భామ  మేఘా ఆకాష్ ల పేర్లు బాగా వినబడుతున్నాయి. 

మరి అను ఇమ్మాన్యువల్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలోనూ, అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' లోను నటిస్తూ బిజీగా వుంది. అలాగే త్రివిక్రమ్ దర్శకతంలో ఎన్టీఆర్ సరసన కూడా అను పేరు బాగా వినబడుతుంది. అలాగే పూజ హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తుంది. అంతేకాకుండా చైతన్య - చందూ మొండేటి కలయికలో రాబోయే చిత్రానికి కూడా పూజ పేరు వినబడుతుంది . ఇకపోతే మేఘ ఆకాష్ చేతిలో ప్రస్తుతానికి నితిన్ సినిమా తప్ప ఇంకో సినిమా లేదు. మరి నాగ చైతన్య పక్కన మారుతి దర్శకత్వంలో రాబోయే సినిమాకి ఫైనల్ గా మేఘ ఆకాషే సెట్ అయ్యేలా కనబడుతుంది... చూద్దాం ఏం జరుగుతుందో?

Nithiin Lie Heroine Megha Akash in Naga Chaitanya Film:

Megha Aksah in Naga Chaitanya and Maruthi Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs