Advertisement
Google Ads BL

లిస్ట్: 2018-19 ఏ పండుగ ఏ తేదీన జరుపుకోవాలి?


శని, ఆదివారాలలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్య మహాసభల్లో వచ్చే ఏడాది నుంచి ఏ పండుగ ఏ తేదీన జరుపుకోవాలో నిర్ణయించినట్లు తెలియజేశారు. సభలో చేసిన నిర్ణయాలను సభ నిర్వాహకులు ఎం. వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రి తత్వానంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మ తదితరులు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ను కలిసి పండుగల తేదీల వివరాలను అందజేశారు. ఈ తేదీలనే అధికారికంగా గుర్తించనున్నట్లు ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. వచ్చే ఏడాది ఉగాది పర్వదినమైన విళంబి నామ సంవత్సరం ప్రారంభం నుంచి ఏడాది పాటు జరుగనున్న పండుగలు వ్రతాల తేదీలను నిర్ణయించారు. వాటిలో పండుగ తేదీల వివరాలిలా ఉన్నాయి.
చైత్రమాసంలో.. 
18-03-2018 ఉగాది, వసంత నవరాత్రోత్సవారంభం, చంద్రోదయం
20-03-2018 డోలా గౌరీ వ్రతం
22-03-2018 మత్య్స జయంతి, లక్ష్మీపంచమి
25-03-2018 స్మార్తానాం, శ్రీరామనవమి, అశోకాష్టమి, ధర్మదశమి
26-03-2018 శ్రీ వైష్ణవానం, శ్రీరామనవమి
27-03-2018 సర్వేషాం ఏకాదశి
28-03-2018 వామనద్వాదశి
29-03-2018 అనంగ త్రయోదశి, మహవీరజయంతి
31-03-2018 శ్రీహనుమద్విజయోత్సవం
03-04-2018 సంకష్టహరచతుర్థి
11-04-2018 స్మార్తానాం ఏకాదశి
12-04-2018 మాధ్వ, శ్రీవైష్ణవానాం ఏకాదశి
14-04-2018 మాసశివరాత్రి శని త్రయోదశి, మేషమాసం
15-04-2018 అమావాస్యోపవాసం
16-04-2018 సోమవతీ అమావాస్య
వైశాఖమాసంలో.. 
18-04-2018 పరశురామ జయంతి, బలరామ జయంతి, అక్షరతృతీయ
20-04-2018 శ్రీశంకరాచార్య జయంతి
21-042018 శ్రీరామానుజ జయంతి
22-04-2018 కన్యాకుమారి జయంతి
25-04-2018 వాసవీ కన్యకా జయంతి
26-04-2018 సర్వేషాం ఏకాదశి
27-04-2018 పరశురామ ద్వాదశి
28-04-2018 స్మార్తానాం నృసింహజయంతి, శని త్రయోదశి
29-04-2018 నృసింహ జయంతి, బుద్ధపూర్ణిమ, అన్నమాచార్య జయంతి, వ్యాసపూర్ణిమ
03-05-2018 సంకష్ణహర చతుర్ధి
04-05-2018 వాస్తుకర్తరి ప్రారంభం
10-05-2018 శ్రీహనుమాన్ జయంతి
13-05-2018 మాసశివరాత్రి
15-05-2018 వృషభమాసం
అధిక జ్యేష్టమాసం.. 
25-05-2018 సర్వేషాం ఏకాదశి, అగ్నికర్తరి సమాప్తం
29-05-2018 వాస్తుకర్తరి సమాప్తం
02-06-2018 సంకష్టహర చతుర్ధి
08-06-2018 మృగశిర కార్తి
10-06-2018 సర్వేషాం ఏకాదశి
12-06-2018 మాసశివరాత్రి
నిజ జ్యేష్టమాసం 
15-06-2018 చంద్రోదయం, బౌద్ధ కల్కి జయంతి, మిథునమాసారంభం
23-06-2018 స్మార్తానాం ఏకాదశి, గంగా భగవతీ దశహర పాపహర వ్రతాలు
24-06-2018 మాధ్య, శ్రీవైష్ణవానాం ఏకాదశి, శ్రీ కూర్మజయంతి, రామలక్ష్మణ త్రయోదశి
28-06-2018 వట సావిత్రి వ్రతం, వృషభ పూజ
01-07-2018 సంకష్టహర చతుర్థి
09-07-2018 సర్వేషాం ఏకాదశి
11-07-2018 మాసశివరాత్రి
13-07-2018 వటసావిత్రి వ్రతం (కొందరికి)
ఆషాఢమాసం 
14-07-2018 చంద్రోదయం, జగన్నాథ రథయాత్ర
17-07-2018 స్కందపంచమి, దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటకమాసారంభం
23-07-2018 సర్వేషాం తొలి ఏకాదశి, చతుర్మాస్య గోపద్మ వ్రతారంభాలు
27-07-2018 వ్యాసపూర్ణిమ, గురుపూర్ణిమ
29-07-2018 సింకింద్రాబాద్ మహంకాళి జాతర
31-07-2018 సంకష్ట హరచతుర్థి
07-08-2018 స్మార్త, శ్రీ వైష్ణవ ఏకాదశి
08-08-2018 మాధ్వ ఏకాదశి
09-08-2018 మాసశివరాత్రి
11-08-2018 అమావాస్య, చుక్కల అమావాస్య
శ్రావణమాసం 
14-08-2018 నాగుల చవితి
15-08-2018 నాగ, గరుడ పంచమి, స్వర్ణ గౌరీ వ్రతం
17-08-2018 సింహమాసారంభం
22-08-2018 సర్వేషాం ఏకాదశి
24-08-2018 వరలక్ష్మీ వ్రతం
25-08-2018 వరాహజయంతి, ఋగ్వేద ఉపాకర్మ
26-08-2018 శ్రావణ పూర్ణిమ, రాఖీపూర్ణిమ, హయగ్రీవ జయంతి, యజుర్వేద ఉపాకర్మ
28-08-2018 శ్రీరాఘవేంద్ర ఆరాధన
29-08-2018 సంకష్ట హర చతుర్థి
02-09- 2018 స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి
03-09-2018 శ్రీ వైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి
06-09-2018 సర్వేషాం ఏకాదశి
08-09-2018 మాసశివరాత్రి
09-09-2018 పోలాల అమావాస్య
భాద్రపదమాసం 
11-09-2018 చంద్రోదయం, సామోపాకర్మ
12-09-2018 షోడశోమా, హరితాళికా వ్రతాలు
13-09-2018 వినాయకచవితి
14-09-2018 ఋషి పంచమి
16-09-2018 జ్యేష్టాష్ఠమీ
17-09-2018 కన్యమాసారంభం
20-09-2018 సర్వేషాం ఏకాదశి
22-09-2018 శని త్రయోదశి
23-09-2018 అనంత వ్రతం
25-09-2018 మహలాయపక్ష ప్రారంభం
28-09-2018 సంకష్టహర చతుర్థి, భరణి మహాలయం
05-10-2018 సర్వేషాం ఏకాదశి
07-10-2018 మాసశివరాత్రి
08-10-2018 మహాలయ అమావాస్య, అమావాస్యోపవాసం
అశ్వీజమాసం
10-10-2018 చంద్రోదయం, శ్రీదేవి వరన్నవరాత్రారంభం
15-10-2018 (మూలా) సరస్వతీపూజ
16-10-2018 త్రిరాత్ర కలశస్థాపన
17-10-2018 దుర్గాష్టమి
18-10-2018 మహర్నవమి, విజయదశమి, తులామాసారాంభం
20-10-2018 సర్వేషాం ఏకాదశి
21-10-2018 గోపద్మ త్రయోదశి
23-10-2018 కోజాగర వ్రతం
24-10-2018 శరత్పూర్ణిమ
27-10-2018 అట్లతద్ది, సంకష్ట హర చతుర్థి
03-11-2018 స్మార్తానాం ఏకాదశి
04-11-2018 మాధ్వ, శ్రీ వైష్ణవ ఏకాదశి
05-11-2018 మాస శివరాత్రి, నరక చతుర్థశి
06-11-2018 దీపావళి, మాసశివరాత్రి
07-11-2018 ధనలక్ష్మి పూజలు, కేదార వత్రం
కార్తీకమాసం
08-11-2018 బలిపాడ్యమి, ఆకాశదీప ప్రారంభం
09-11-2018 చంద్రోదయం, యమద్వితీయ, ఢగినీ హస్త భోజనం
11-11-2018 నాగుల చవితి, వల్మీకపూజ
19-11-2018 సర్వేషాం ఏకాదశి
20-11-2018 చిలుకద్వాదశి,తులసీ వ్రతారంభం
21-11-2018 వైకుంఠ చతుర్ధశి
23-11-2018 కార్తీక పూర్ణిమ
26-11-2018 సంకష్ట హర చతుర్థి
03-12-2018 సర్వేషాం ఏకాదశి
05-12-2018 మాసశివరాత్రి
మార్గశిర మాసం
13-12-2018 సుబ్రహ్మణ్య షష్టి
16-12-2018 ధనుర్మాసం ప్రారంభం
18-12-2018 సర్వేషాం(వైకుంఠ) ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి
20-12-2018 శ్రీహనుమద్వ్రతం
22-12-2018 దత్త జయంతి
25-12-2018 సంకష్టహర చతుర్ధి
01-01-2019 స్మార్త, శ్రీ వైష్ణవ ఏకాదశి
02-01-2019 మాధ్వ ఏకాదశి
04-01-2019 మాసశివరాత్రి
పుష్యమాసం 
14-01-2019 భోగిపండుగ, మకరమాసారంభం రాత్రి 1.35 గంటలకు 
15-01-2019 సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం
16-01-2019 కనుము పండుగ
17-01-2019 సర్వేషాం ఏకాదశి
19-01-2019 శని త్రయోదశి
24-01-2019 సంకష్టహర చతుర్థి
25-01-2019 శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన
31-01-2019 సర్వేషాం ఏకాదశి
02-02-2019 శనిత్రయోదశి
03-02-2019 మాసశివరాత్రి
మాఘమాసం
10-02-2019 వసంత పంచమి( శ్రీ పంచమి)
12-02-2019 రథసప్తమి
13-02-2019 కుంభమాసారంభం
14-02-2019 మధ్వనవమి
15-02-2019 స్మార్తానాం ఏకాదశి
16-02-2019 మాధ్వ, శ్రీ వైష్ణవానాం ఏకాదశి
19-02-2019 వ్యాస పూర్ణిమ
22-02-2019 సంకష్టహర చతుర్ధి
02-03-2019 సర్వేషాం ఏకాదశి
04-03-2019 మహాశివరాత్రి
ఫాల్గుణమాసం
12-03-2019 భౌమషష్ఠి
14-03-2019 హోళి కాష్టకం
15-03-2019 మీనమాసారంభం
17-03-2019 సర్వేషాం ఏకాదశి
19-03-2019 కామదహనం(దక్షిణాదివారికి)
20-03-2019 కామదహనం (ఉత్తరాదివారికి)
21-03-2019 హోళికోత్సవం
24-03-2019 సంకష్టహర చతుర్థి
31-03-2019 స్మార్తానాం ఏకాదశి
01-04-2019 మాధ్వ, శ్రీ వైష్ణవానాం ఏకాదశి
03-04-2019 మాసశివరాత్రి
06-04-2019 స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర ఉగాది
శుక్రమూఢము 21-10 2018 నుంచి 31-10-2018 వరకు 
గురుమూఢము 12-11-2018 నుంచి 10-12-2018 వరకు 
చంద్రగ్రహణము 27-07-2018 రాత్రి 11. 56 గంటల నుంచి రాత్రి 3.50 వరకు
పుష్కరాలు 11-10-2018 గురువారం రాత్రి 7.18లకు సార్థ్రకోటి తీర రాజ సహిత శ్రీ భీమరధీ నదీ పుష్కర ప్రవేశం
భీమాశంకర్, పండరీపూర్, గానుగాపూర్ (మహారాష్ట్ర)
వాసుకర్తరి 04-05-2018 నుంచి 29-05-2018 వరకు
అగ్రికర్తరి 11-05-2018 నుంచి 25-05-2018 వరకు

Advertisement
CJ Advs

KCR Releases 2018-19 Festivals list at Pragathi Bhavan:

Telangana State Releases 2018-19 Festivals list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs