Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'!


పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంపార్టెంట్ అయిన తన 25 వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో చిన్నపాటి షెడ్యూల్లో ఫినిష్ చేసుకునే పనిలో ఉంది. ఇక అక్కడ షూటింగ్ పూర్తి కాగానే  చిత్ర యూనిట్ అక్కడినుండి యూరప్ బయలుదేరి వెళ్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి ఎంతో సస్పెన్స్ మెయింటింగ్ చేస్తూ టైటిల్ రివీల్ చెయ్యకుండా... సినిమాని మాత్రం సంక్రాంతి అంటే... జనవరి 10 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి, బోమన్ ఇరానీ వంటి నటీనటుల తో పాటు.... పవన్ కి జోడిగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లూ నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాకి టైటిల్ గా 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి పవన్ అజ్ఞాతవాసం నుండి బయటికి వచ్చి శత్రువుల పనిపడతాడనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది. అయితే  గతంలో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అత్తారింటికి దారేది' కథలో లో మేనత్తని పుట్టింటింటికి తీసుకురావడానికి మేనల్లుడు ఎలాంటి కష్టాలు పడతాడు అనేది చాలా ఇంట్రస్టింగ్ గా చూపించారు. అత్తని దారికి తీసుకొచ్చే అల్లుడిగా పవన్ నటనకు తెలుగు ప్రజలు నీరాజనాలు పట్టారు. అలాంటి కథతో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం అప్పట్లో  ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు పవన్ 25  వ సినిమా కూడా ఇలాంటి ఒక స్ట్రాంగ్ స్టోరీతో రాబోతుంది అంటున్నారు.

ఈ చిత్రంలో దాదాపు 7 పోరాట సన్నివేశాలు ఉంటాయని... అలాగే తండ్రి కొడుకుల అనుబంధం మీద ఈ స్టోరీ మొత్తం తిరుగుందంటున్నారు. పవన్ గతంలో తండ్రి పాత్రని హైలైట్ చేసిన సుస్వాగతం మాదిరిగా త్రివిక్రమ్ మార్కుతో ఈ సినిమా ఉండబోతుందని,  తండ్రి తో ఉన్న అనుబంధం... అలాగే తండ్రి చావుకు కారణమైన వ్యాపార శత్రువులపై పవన్ రివెంజ్ తీసుకునే కాన్సెప్ట్ తో అంటే.... ఇదో రివేంజ్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు.. అలాగే నటి ఖుష్బూ పాత్ర కూడా ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలవనుందంటున్నారు. 

PSPK 25 Film Main Concept :

Pawan Kalyan Suswagatham Shades in PSPK25 Film 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs