Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ రికార్డులు కొల్లగొట్టేస్తున్నాడు!


బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా 'జై లవ కుశ'. ఈ చిత్రం ఈ నెల 21 న విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 10  ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో విడుదల చేసిన 'జై లవ కుశ' ట్రైలర్ టాక్ అద్భుతంగా ఉందంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు... టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ కూడా 'జై లవ కుశ' ట్రైలర్ గురించి గొప్పగా పొగిడేస్తున్నారు. ఇక 'జై లవ కుశ' ట్రైలర్ ని చూడడానికి ఆత్రుత పడిన ఫాన్స్ ఆ ట్రైలర్ విడుదల కాగానే విపరీతంగా షేర్ చేసెయ్యడంతో యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లలో ఈ ట్రైలర్ కి నమ్మశక్యం కానీ వ్యూస్ నమోదయ్యాయంటున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వెల్లడించిన లెక్కల ప్రకారం.... 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ 24  గంటల్లో ఫేస్ బుక్, యూట్యూబ్ వ్యూస్ కలిపి 7.54  మిలియన్ డిజిటల్ వ్యూస్ నమోదయినట్లు ప్రకటించింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ట్రైలర్ తర్వాత అత్యధిక వ్యూస్ నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ నాన్ బాహుబలి రికార్డ్స్ సాధించి రికార్డు సృష్టించినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ 'జై లవ కుశ' కేవలం వ్యూస్ పరంగానే కాకుండా లైక్స్ పరంగాను సంచలన రికార్డు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. 'జై లవ కుశ' చిత్ర బృందం వెల్లడించిన లెక్కల పరికరం 24  గంటల్లో 'జై లవ కుశ' కు 174  వేల లైక్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతకు ముందు 'కాటమరాయుడు' 156  వేల లైక్స్ తో యూట్యూబ్ ని రఫ్ ఆడేసింది. అయితే ఇపుడు ఎన్టీఆర్ తన 'జై లవ కుశ'తో 'కాటమరాయుడు' రికార్డులని నామరూపాలేకుండా చేసేసి టాప్ లో నిలిచింది.

Jai Lava Kus with 7.54M Digital Views:

The makers of the movie claimed that the trailer recorded 7.54M real time digital views in just 24 hours.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs